జార్ఖండ్ పీఠంపై కాంగ్రెస్-జేఎంఎం కూటమి... ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్

దేశ రాజకీయాలలో గత కొద్ది రోజులుగా పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో జార్ఖండ్ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి.అయితే ఈ ఎన్నికలలో గెలిచి తమ బలం నిరూపించుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని భావించిన బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

 Jharkhand Elections Congress Jmm Congress-TeluguStop.com

పౌరసత్వ సవరణ బిల్లు ఎఫెక్ట్ ఈ ఎన్నికలలో బీజేపీ మీద పడిందనే మాట వినిపిస్తుంది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి తగ్గట్లుగానే తాజా ఫలితాలలో కాంగ్రెస్-జేఎంఎం కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 స్థానాలు అవసరం.ఇక కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది.21 స్థానాల్లో బీజేపీ ముందజలో కొనసాగుతోంది.

ఫలితాల సరళి బట్టి కాంగ్రెస్-జేడీఏం అధికారంలోకి వచ్చినట్లే అని తెలుస్తుంది.

కూటమి అధికారంలోకి వస్తే జేఎంఏం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరిస్తారని ప్రకటించింది.ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీ రావడంతో జార్ఖండ్‌ కాబోయే సీఎం జేఎంఎం అధ్యక్షుడు హేమంత్‌ సొరేన్‌‌నే అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సాధారణమైన జీవితాన్ని ఇష్టపడే సోరెన్ తండ్రి వారసత్వం తీసుకొని కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించారు.ప్రజలలో తిరుగుతూ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘువార్ దాస్ తన మీద బీజేపీ రెబల్ అభ్యర్ధిగా పోటీ చేసిన సర్యూరాయ్ చేతిలో ఓడిపోయాడు.జంషెడ్‌పూర్‌ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘువర్‌దాస్‌ ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube