జాన్వి పారితోషికం.. బాలీవుడ్‌లో కూడా ఇంత దారుణంగా ఉంటుందా?     2018-07-22   13:18:02  IST  Ramesh Palla

బాలీవుడ్‌ సినిమాలు అంటే భారీగా ఉంటాయి, దేశ వ్యాప్తంగా మార్కెట్‌ ఉంటుంది కనుక ఏమాత్రం సక్సెస్‌ అయినా వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. స్టార్‌ హీరోల సినిమాలు ఫ్లాప్‌ అయినా కూడా వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి అంటే ఏ స్థాయిలో హిందీ సినిమాకు మార్కెట్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందడం చాలా కామన్‌. ఇక బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పారితోషికం కూడా భారీ ఎత్తున ఉంటుందని అంతా అంటూ ఉంటారు. సౌత్‌ హీరోయిన్స్‌తో పోల్చితే బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పారితోషికం మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు.

ఇక తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. హిందీ సినీ పరిశ్రమలో జాన్విని శ్రీదేవి పరిచయం చేయడం జరిగింది. పెద్ద బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మాణం జరిగింది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరాఠి చిత్రంకు డబ్బింగ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘ధడక్‌’ అనే టైటిల్‌ను పెట్టి విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలతో మొదటి రోజే ఏకంగా 9 కోట్ల రూపాయల వసూళ్లను ఈ చిత్రం దక్కించుకుంది. లాంగ్‌ రన్‌లో మంచి వసూళ్లను సాధించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Jhanvi Kapoor Remuneration For Dhadak Movie-

Jhanvi Kapoor Remuneration For Dhadak Movie

ఇంత భారీ విజయాన్ని దక్కించుకున్న ‘ధడక్‌’ చిత్రానికి జాన్వి తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు. ఈ చిత్రం కోసం జాన్వి కేవలం 60 లక్షలు మాత్రమే పొందిందట. బాలీవుడ్‌లోనే టాప్‌ నిర్మాత అయిన కరణ్‌ జోహార్‌ మరీ పిసినారిగా 60 లక్షల పారితోషికం ఇవ్వడం ఏంటని శ్రీదేవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్‌ అయ్యింది కనుక ఇప్పుడైనా జాన్వికి గౌరవ ప్రధమైన పారితోషికం ఇవ్వాలంటూ అంతా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే నిర్మాత కరణ్‌ జోహార్‌ మాత్రం పారితోషికం విషయంలో ఎలాంటి సంప్రదింపులు ఇప్పుడు లేవు. మొత్తం పారితోషికం అందరికి ఇచ్చేశాం అంటున్నాడట.

ఇక హీరోగా నటించిన కుర్రాడు ఇషాన్‌ పరిస్థితి మరీ దారుణం. కేవలం 50 లక్షలు మాత్రమే ఆ కుర్రాడికి దక్కిందని సమాచారం అందుతుంది. బాలీవుడ్‌ చిత్రాల్లో కూడా ఇంతటి దారుణమైన పారితోషికాలు ఉంటాయా అంటూ సౌత్‌ ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు.