విజయ్ తో తనది ఆర్య టైప్ వన్ సైడ్ లవ్... జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇమేజ్ ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉంది.ఓ విధంగా చూసుకుంటే బాలీవుడ్ హీరోయిన్స్ ని సైతం విజయ్ తన లుక్స్, యాటిట్యూడ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

 Jhanvi Kapoor One Side Crush On Vijay Devarakonda-TeluguStop.com

బాలీవుడ్ భామలు అక్కడి హీరోలని వదిలేసి విజయ్ దేవరకొండకి ఫిదా అయిపోతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ తాను విజయ్ దేవరకొండ ఫ్యాన్ అని ఓ సందర్భంగా చెప్పింది.

ఇక ఇద్దరు కలిసి ఓ సెలబ్రిటీ ఫాషన్ ఈవెంట్ లో, అలాగే ఓ యాడ్ లో కలిసి సందడి చేశారు.ఇక ఈ మధ్యకాలంలో బీటౌన్ లో హీరోలతో కలిసి సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ అక్కడ కూడా పాగా వేయడానికి రెడీ అయిపోతున్నాడు.

ఇదిలా ఉంటే జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ తాను విజయ్ దేవరకొండ కి పెద్ద ఫ్యాన్ ని అని ఓ సందర్భంగా చెప్పింది.టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే అతనితో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ భామ మరో సారి విజయ్ మీద తనకున్న ప్రేమని చాటుకుంది.విజయ్ మీద తనది వన్ సైడ్ క్రష్ అని చెప్పింది.

ఈ విషయాన్ని ఇది వరకే చెప్పిన అతను స్పందించలేదని సరదాగా చెప్పింది.అయితే విజయ్ నట్టు పట్టించుకోవడం లేదని, నేనే అతని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్లు ఉందని మీడియాతో నవ్వుతూ చెప్పింది.

తనకి విజయ్ నటన నచ్చుతుందని చెప్పింది.మరి జాన్వీ కపూర్ కామెంట్స్ పై విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తాడు అనేది ఇప్పుడు చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube