టాలీవుడ్ ఎంట్రీకి డేట్స్ ఖాళీ లేవు అంటున్న జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.ఇప్పటికే ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

 Jhanvi Kapoor Not Ready To Tollywood Entry-TeluguStop.com

హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఒక మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.అలాగే కరణ్ జోహార్ దర్శకత్వంలో బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు ధర్మ ప్రొడక్షన్ లో కొన్ని సినిమాలకి కమిట్ అయ్యి ఉంది.

ఇలా గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేతిలో పెట్టుకొని బిజీ షెడ్యూల్స్ పెట్టుకొని ఉంది.ఎప్పుడు పూర్తిస్థాయిలో షూటింగ్ లు స్టార్ట్ అయిన కూడా జాన్వీ కపూర్ వరుసగా సినిమాలు చేయాల్సి ఉంటుంది.

 Jhanvi Kapoor Not Ready To Tollywood Entry-టాలీవుడ్ ఎంట్రీకి డేట్స్ ఖాళీ లేవు అంటున్న జాన్వీ కపూర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పుడు జాన్వీ కపూర్ ని తెలుగులోకి తీసుకురావడానికి ముగ్గురు బడా నిర్మాతలు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు, హారికా హాసినీ క్రియేషన్స్, దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే కొరటాల, ఎన్టీఆర్ సినిమా కోసం కూడా జాన్వీ కపూర్ ని సంప్రదించారు.

Telugu Bollywood, Dil Raju, Jhanvi Kapoor, Jr Ntr, Mythri Movie Makers, Tollywood, Tollywood Entry-Movie

ఈ ప్రొడక్షన్స్ లో అందరూ స్టార్ హీరోలతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం వారు ప్లాన్ చేశారు.కాని ఈ బ్యూటీ మాత్రం తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి తాను ఇప్పట్లో సిద్ధంగా లేననే సంకేతాలు ఇస్తుంది.ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాలతో బిజీగా ఉండటం డేట్స్ లేవని ఆయా నిర్మాతలకి చెప్పెసినట్లు వినికిడి.

హిందీలో ఆమె చేతిలో ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాల వరకు ఉన్నాయి.వీటి తర్వాత కూడా చాలా ప్రాజెక్ట్ లలో జాన్వీ కపూర్ ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో తన మొదటి ప్రాధాన్యత హిందీ సినిమాలకే అని ఈ యంగ్ బ్యూటీ తేల్చి చెప్పేస్తుంది.హిందీలో సినిమాలు లేకపోతే అప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెట్టె అవకాశం ఉందని, అంత వరకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం కష్టం అని ఆమె సన్నిహితులు తేల్చేస్తున్నారు.

#Jhanvi Kapoor #MythriMovie #Jr NTR #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు