రౌడీస్టార్‌కు ఇచ్చేంత పారితోషికం ఇస్తామన్నా ఆమె ఒప్పుకోవడం లేదట

విజయ్‌ దేవరకొండ అతి త్వరలో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఓ రేంజ్‌లో ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

 Jhanvi Kapoor Not Accepting The Puri Jaganth Movie-TeluguStop.com

ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఆయన తదుపరి చిత్రం గురించి అప్పుడే పెద్ద ఎత్తున చర్చలు మొదలు అయ్యాయి.విజయ్‌ దేవరకొండ తదుపరి మూవీకి పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.

పూరి ఇస్మార్ట్‌ శంకర్‌తో ఫామ్‌లోకి వచ్చాడు.అందుకే ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

ఫైటర్‌ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని చేయబోతున్నారట.ఇక విజయ్‌ దేవరకొండకు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చాలా రోజులుగా ఆమెతో పూరి చర్చలు జరుపుతూనే ఉన్నాడు.విజయ్‌ దేవరకొండ సినిమాకు అయిదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు.అంత మొత్తంను జాన్వీ కపూర్‌కు ఇస్తాము అంటే ఏమాత్రం ఒప్పుకోవడం లేదు.జాన్వీ పాత్రను కూడా మార్చి వినిపించే ప్రయత్నంలో ఉన్నాడు.

మరి ఇప్పుడైనా ఆమె ఒప్పుకుంటుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube