నయనతార హిట్ మూవీ రీమేక్ లో జాన్వీ కపూర్  

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్.ఈ అమ్మడు ధఢక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది.

TeluguStop.com - Jhanvi Kapoor Main Lead In Nayanatara Hit Movie Remake

తరువాత ఎవరూ ఊహించని విధంగా గుంజన్ సక్సేనాతో బయోపిక్ కథని ఒకే చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

ఇందులో జాన్వీ కపూర్ నటనకి మంచి మార్కులు పడ్డాయి.మొదటి రెండు సినిమాలతోనే శ్రీదేవికి సరైన వారసురాలు అనే ప్రశంసలు జాన్వీ కపూర్ అందుకుంది.

TeluguStop.com - నయనతార హిట్ మూవీ రీమేక్ లో జాన్వీ కపూర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం కరణ్ జోనర్ దర్శకత్వంలో బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు మరో భారీ బడ్జెట్ చిత్రంలో కూడా జాన్వీ కపూర్ నటిస్తుంది.దాంతో పాటు మరో సినిమా లైన్ లో ఉంది.వీటితో పాటు ఇప్పుడు ఓ తమిళ్ మూవీ రీమేక్ కి జూనియర్ శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
0

తమిళంలో లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ లో నటించిన కొలమావు కోకిల సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార అభినయానికి మంచి ప్రశంసలు లభించాయి.అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ రీమేక్ చేస్తున్నారు.

దీనికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్ ని తీసుకున్నారు.

జాన్వీ కపూర్ కి తగ్గట్లు క్యారెక్టరైజేషన్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తుంది. జనవరి 9 నుంచి పంజాబ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

సింగిల్ షెడ్యూల్ లోనే మొత్తం చిత్రీకరణను పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది.మొత్తానికి శ్రీదేవి కూతురు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతూ నెక్స్ట్ స్టార్ హీరోయిన్ గా మారడానికి మార్గం ఏర్పరుచుకుంటుంది.

#Anand L Rai #@janhvikapoorr #Nayanatara #Jhanvi Kapoor #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు