తమిళ అర్జున్‌ రెడ్డిలో జాన్వీ కపూర్‌... ఇది నిజమైతే సంచలనమే  

తమిళంలో ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌ గా రూపొందుతున్న ‘వర్మ’ చిత్రంను ఉన్నట్లుండి మొత్తం క్యాన్సిల్‌ చేసి ఇప్పటికే చిత్రీకరణ చేసిన ఫుటేజ్‌ను చెత్త బుట్టలో వేసిన విషయం తెల్సిందే. అత్యంత చర్చనీయాంశం అయిన ఈ విషయంపై ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టిస్తున్నారు. వర్మ సినిమా ఫుటేజ్‌ మొత్తం తొలగించి, దర్శకుడు, హీరోయిన్‌, టెన్నీషియన్స్‌ అందరిని మార్చబోతున్నారు. నిర్మాత మరియు హీరో మాత్రమే ఉండబోతున్నారు. ఇక హీరోయిన్‌ విషయంలో చాలా ఆసక్తికర చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది.

Jhanvi Kapoor In Tamil Arjun Reddy Movie-Jhanvi Tamil Movie Varma Vijay Devara Konda Next

Jhanvi Kapoor In Tamil Arjun Reddy Movie

అర్జున్‌ రెడ్డి లో హీరోయిన్‌ ముద్దులు హద్దులు లేకుండా పెట్టాల్సి ఉంటుంది. అలాంటి పాత్రను ఎవరు చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో జాన్వీ కపూర్‌తో వర్మలో హీరోయిన్‌ పాత్రను చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమద్య ఒక తమిళ మీడియా సంస్థకు జాన్వీ కపూర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తమిళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన ఒక ఆఫర్‌ను పరిశీలిస్తున్నాను. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాను అంటూ చెప్పింది. తాజాగా వర్మకు ఆమె ఓకే చెప్పి ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.

Jhanvi Kapoor In Tamil Arjun Reddy Movie-Jhanvi Tamil Movie Varma Vijay Devara Konda Next

శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్‌కు తమిళ సినీ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ కారణంగా ఈమె వర్మలో నటిస్తే సంచలనమే అనుకోవాలి. అర్జున్‌ రెడ్డి సినిమాపై ఆమద్య జాన్వీ కపూర్‌ పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యింది. మంచి సినిమా అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు రీమేక్‌లో ఆమె నటించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వర్మ రీ షూట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

Jhanvi Kapoor In Tamil Arjun Reddy Movie-Jhanvi Tamil Movie Varma Vijay Devara Konda Next