విజయ్‌ దేవరకొండ గురించి మరోసారి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఈసారి గాలి తీసింది     2019-01-11   11:10:37  IST  Ramesh Palla

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరో మరియు యూత్‌లో అత్యధిక క్రేజ్‌ ఉన్న హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు విజయ్‌ దేవరకొండ. అవును ఈయన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌ వరకు కూడా తన సత్తాను చాటుతున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమా హిందీలో రీమేక్‌ అవుతుంది. అయితే ఇప్పటికే బాలీవుడ్‌ మేకర్స్‌కు అర్జున్‌ రెడ్డి ద్వారా విజయ్‌ దేవరకొండ పరిచయం అయ్యాడు. ఇక అర్జున్‌ రెడ్డితో పాటు ఇప్పుడు గీత గోవిందం సినిమా కూడా అక్కడ రీమేక్‌ అవుతుందంటున్నారు. విజయ్‌ దేవరకొండకు అక్కడ కూడా అభిమానులు ఉన్నారు.

Jhanvi Kapoor About Marry With Vijay Devarakonda-Jhanvi Krush Love And Marriage Devarakonda

Jhanvi Kapoor About Marry With Vijay Devarakonda

కొన్ని రోజుల క్రితం కాఫీ విత్‌ కరణ్‌ షోలో విజయ్‌ దేవరకొండ గురించి జాన్వీ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఆటీట్యూడ్‌ నాకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. విజయ్‌ దేవరకొండ గురించి ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో అతడంటే నాకు క్రష్‌ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి విజయ్‌పై చాలా స్పెషల్‌గా కామెంట్స్‌ చేసింది. విజయ్‌ దేవరకొండతో ఛాన్స్‌ లభిస్తే తప్పకుండా సినిమా చేస్తానంటూ జాన్వీ కపూర్‌ చెప్పడంతో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ను కాస్త నిరాశ పర్చాయి.

Jhanvi Kapoor About Marry With Vijay Devarakonda-Jhanvi Krush Love And Marriage Devarakonda

తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ మాట్లాడటం జరిగింది. విజయ్‌ అంటే క్రష్‌ అంటున్నారు కదా, మరి అతడిని పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా అంటూ ఇంటర్వ్యూవర్‌ ప్రశ్నించాడు. ఆ సమయంలో ఆమె సమాధానం చెప్పి, ఇది పిచ్చి ప్రశ్న. క్రష్‌ ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకుంటామా, విజయ్‌ దేవరకొండను పెళ్లి చేసుకునే ఆలోచన కాని, ప్రేమ ఆలోచన కాని నాకు అస్సలు లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఒక నటుడిగా మాత్రమే అతడు తనకు స్పెషల్‌ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.