కరోనా దోపిడీ,కిట్ లతో వచ్చిమరీ….  

jewellery shop looted with PPE kits in Maharashtra, Maharashtra, PPE Kits - Telugu Jewellery Shop Looted With Ppe Kits In Maharashtra, Maharashtra, Ppe Kits

కరోనా మహమ్మారి తో జనాలు అల్లాడుతుంటే ఈ పేరు చెప్పుకొని కొందరు దోపిడీ లకు పాల్పడుతున్నారు.అలాంటి ఒక కరోనా దోపిడీ ఘటన దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

 Jewellery Shop Ppe Kits Maharashtra

మహారాష్ట్ర లోని సతారా జిల్లా లో పెద్దగా బిజినెస్ లేకపోవడం తో మధ్యాహ్నం దాకా మాత్రమే షాప్ లను మూసేస్తున్నారు.ఈ క్రమంలోనే చిన్న చిన్న బేరాలు చూసుకొని ఒక బంగారు షాపు ఓనరు ఇంటికి వెళ్ళిపోయాడు.

అయితే రాత్రి అయిన తరువాత చీకట్లో షాపు దగ్గరకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లతో వచ్చిన కొందరు,తమ దగ్గరున్న పరికరాలతో షాపు గోడకు కన్నం పెట్టి మరీ దోపిడీ కి పాల్పడినట్లు తెలుస్తుంది.
గోడకు కన్నం పెట్టిన ఆ దుండగులు లోపలికి వెళ్లి… షోకేసుల్లో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకుపోయినట్లు తెలుస్తుంది.

కరోనా దోపిడీ,కిట్ లతో వచ్చిమరీ….-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ సమయంలో అటుగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కూడా ఆ షాపు దగ్గర ఎలాంటి అనుమానమూ రాకపోవడం తో ఏమాత్రం తెలియలేదు.అయితే తెల్లారే షాపుకి వచ్చిన ఓ ఉద్యోగి గోడకు ఏర్పడ్డ కన్నం చూసి ఒక్కసారిగా అవాక్కైపోయాడు.

వెంటనే జరిగిన విషయాన్నీ షాపు ఓనర్ కి ఫోన్ చేసి చెప్పడం తో ఒక్కసారిగా ఓనర్ గుండె ఆగినంత పనైంది.అయినప్పటికీ ఉరుకున షాపు వద్దకు వచ్చి అక్కడి పరిస్థితిని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పీపీఈ కిట్ లు ధరించి దాదాపు షాపు లోని మొత్తం 780 గ్రాముల గోల్డ్ పట్టుకుపోయినట్లు లెక్క తేల్చాడు.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే నిందితులు తెలివిగా పీపీఈ ధరించడం తో వారిని కనిపెట్టడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.

#Maharashtra #PPE Kits

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jewellery Shop Ppe Kits Maharashtra Related Telugu News,Photos/Pics,Images..