నాకు కాబోయే భార్య సిరిలా ఉండాలి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ కామెంట్స్ వైరల్?

Jessie Interesting Comments On Siri Hanmanth And Opens About Wife Qualities

బిగ్ బాస్ హౌస్ నుంచి అనారోగ్యం కారణంగా మోడల్ జెస్సీ బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.జెస్సీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు సిరి, షణ్ముఖ్ తో మంచి ఫ్రెండ్ షిప్ చేసాడు.

 Jessie Interesting Comments On Siri Hanmanth And Opens About Wife Qualities-TeluguStop.com

ఇక సిరి కూడా జెస్సీకి అనారోగ్యం పాలైన సమయంలో కంటికి రెప్పలా చూసుకుంటూ, అతడికి సేవలు కూడా చేసింది.దీంతో సిరి అంటే జెస్సీకి అభిమానం ఉంది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా సిరి పై అదే అభిమానాన్ని చూపిస్తున్నాడు జెస్సీ.

 Jessie Interesting Comments On Siri Hanmanth And Opens About Wife Qualities-నాకు కాబోయే భార్య సిరిలా ఉండాలి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సిరి శ్రీహాన్ తో రిలేషన్ లో ఉండి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీగా ఉన్న సిరి, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కు దగ్గరయింది.

హగ్గులు, కిస్ లతో హౌస్ లో ఇప్పటికే పలుసార్లు రెచ్చిపోయారు.అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చి వీరి పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించిన వారిద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ జెస్సీ తనకు సిరి లాంటి అమ్మాయి భార్య కావాలి అంటూ కామెంట్స్ చేశారు.

Telugu Jessie, Nagarjuna, Shanmukh, Siri, Telugu Biggboss-Movie

బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత జెస్సీకి చాలామంది లవ్ ప్రపోజల్స్ చేశారట.జెస్సీకి కాబోయే భార్య సిరిలా ఉండాలట.సిరిలో ఉన్న క్వాలిటీస్ అతనికి కాబోయే భార్యకి ఉండాలని తెలిపాడు.

అదేవిధంగా సిరి నన్ను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎలా చేసుకొందో  మీరు అందరూ చూశారు కదా.నాకు కాబోయే భార్య కూడా అంత కేర్ గా చూసుకోవాలి.సిరి తిట్టినా సరే మళ్ళీ వెంటనే వచ్చి నాకు కావాల్సింది చేసేది తినిపించేది.హెడ్ మసాజ్ చేసేది.సిరి, షన్నునీ ఫ్యామిలీ పర్సన్ గా చూసింది.అందుకే సిరి అంటే నాకు నచ్చుతుంది.

అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు భార్యగా రావాలి అంటూ కామెంట్స్ చేశాడు జెస్సీ.సిరి గురించి జెస్సీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

#Siri #Biggboss #Shanmukh #Jessie #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube