'జెర్సీ' సూపర్‌ హిట్‌.. ఇంకా ఆందోళనలోనే బయ్యర్లు

నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం వారం రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన జెర్సీ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.సినిమాకు మొదటి నుండి కూడా మంచి టాక్‌ ఉన్న కారణంగా మొదటి రోజు 6.5 కోట్ల షేర్‌ను రాబట్టింది.అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది.అయితే అంతకు ముందు వచ్చిన మజిలీ, చిత్రలహరి మరియు అదే రోజు వచ్చిన కాంచన 3 చిత్రాలు జెర్సీ చిత్రం కలెక్షన్స్‌ను మింగేశాయి.

 Jersey Super Hit But Tension In-TeluguStop.com

పైగా జెర్సీ చిత్రంకు సాడ్‌ క్లైమాక్స్‌ ఉన్న కారణంగా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేని కారణంగా బి, సి సెంటర్‌ ప్రేక్షకులు ఆధరణ చూపడం లేదు.

ఈ నేపథ్యంలో లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం కేవలం 20 కోట్లకు మించే అవకాశం లేదని అంటున్నారు.

అయితే అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో దాదాపుగా 30 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేశారు.దాంతో బయ్యర్లు 10 కోట్ల మేరకు నష్టపోయే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రంను 30 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌, మరో 20 కోట్లకు ఇతర రైట్స్‌ అమ్ముడు పోయింది.అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మాత్రం బయ్యర్లు బలి అయినట్లే అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంతో నాని స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోయినట్లే అంటూ అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేని కారణంగా సినిమా దెబ్బ తీసింది.

సినిమాలో కామెడీ, కాస్త రొమాన్స్‌ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అయితే అవి ఉంటే సినిమా ఫీల్‌ పోయేది అనేది చిత్ర దర్శకుడి వాదన.

మొత్తానికి జెర్సీ చిత్రం ఫలితం నాని కెరీర్‌లో రెండు విదాలుగా నిలిచి పోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube