అరుదైన గౌరవం సొంతం చేసుకున్న జెర్సీ మూవీ  

Jersey to be screened at International Indian Toronto Film, Natural star Nani, Gowtham, Tollywood, Telugu Cinema - Telugu Gowtham, Jersey To Be Screened At International Indian Toronto Film, Natural Star Nani, Telugu Cinema, Tollywood

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.తండ్రి, కొడుకుల అనుబంధాన్ని క్రికెట్ తో ముడిపెట్టి దర్శకుడు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు.

 Jersey Natural Star Nani Gowtham

సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడతారు.ఇక ఓడిపోయి గెలిచిన ఆటగాడిగా నేచురల్ స్టార్ నాని అద్భుతమైన నటనతో మెప్పించాడు.

విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమా ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.హిందీలో కూడా రీమేక్ అవుతుంది.

అరుదైన గౌరవం సొంతం చేసుకున్న జెర్సీ మూవీ-Movie-Telugu Tollywood Photo Image

ఇతర భాషలలో కూడా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మరో అపురూపమైన ఘనత దక్కించుకుంది.

జెర్సీ చిత్రం ఓ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతోంది.నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది.

ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది. ‘జెర్సీ’ చిత్రమే కాకుండా, హిందీ నుంచి సూపర్ 30, తమిళం నుంచి కార్తీ నటించిన ఖైదీ కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి.

మొత్తానికి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లడం ద్వారా జెర్సీ సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది.పలువురు సెలబ్రెటీలు ఈ సందర్భంగా జెర్సీ టీమ్ ని అభినందనలు తెలియజేశారు.

ఇక ఈ సినిమాని హిందీలో కూడా గౌతమ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది.ఇందులో సాహిద్ కపూర్ లీడ్ లో నటిస్తున్నాడు.

#Gowtham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jersey Natural Star Nani Gowtham Related Telugu News,Photos/Pics,Images..