నాని 'జెర్సీ' కలెక్షన్స్‌... బయ్యర్ల పరిస్థితి ఏంటీ?  

Jersey Movie Collections -

నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘జెర్సీ’ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైన విషయం తెల్సిందే.ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

Jersey Movie Collections

హీరో చనిపోతే తెలుగు సినిమాలు ఫ్లాప్‌ అవుతాయి.కాని ఈ చిత్రంలో హీరో నాని చనిపోయినట్లుగా చూపించినా కూడా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో పాటు మంచి ఓపెనింగ్స్‌ దక్చాయి.

అప్పటికే వచ్చిన మజిలీ మరియు చిత్రలహరి చిత్రాలు మంచి వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో నాని జెర్సీతో వచ్చిన నేపథ్యంలో వాటి కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టాయి.మొదటి రోజు నాని జెర్సీ చిత్రం ఏకంగా 6.5 కోట్ల వరకు రాబట్టింది.

నాని ‘జెర్సీ’ కలెక్షన్స్‌… బయ్యర్ల పరిస్థితి ఏంటీ-Movie-Telugu Tollywood Photo Image

మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో సునాయాసంగా బయ్యర్లు బయట పడటం ఖాయం అని అంతా భావిస్తున్నారు.అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 26.5 కోట్లకు అమ్ముడు పోయింది.మొదటి మూడు రోజుల్లో కనీసం 13 నుండి 15 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.ఆ తర్వాత వారం రోజుల్లో మరో పది కోట్ల రూపాయలను సునాయాసంగా రాబడుతుందని అలా మొత్తంగా బయ్యర్లను జెర్సీతో నాని బయట పడేయడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

శనివారం మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆది వారం కూడా అదే స్థాయిలో కూడా రాబడితే తప్పకుండా 15 కోట్లను కూడా క్రాస్‌ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

ఈ చిత్రంతో విడుదలైన ‘కాచంన 3’ చిత్రంకు ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ స్పందన రాలేదు.ఆ కారణంగానే జెర్సీ చిత్రం దుమ్ము లేపుతోంది.మజిలీకి మంచి స్పందన వచ్చినా కూడా అది వచ్చి మూడు వారాలు అవుతున్న నేపథ్యంలో కాస్త జోరు తగ్గింది.

ఈ విషయాలన్ని కూడా జెర్సీకి కలిసి వస్తుంది.మొత్తంగా నాని మరోసారి తన సత్తా చాటాడు.నాని నటనకు విమర్శకులు సైతం ఫిదా అవుతున్నారు.కన్నీరు పెట్టించే సీన్స్‌ ఎన్నో సినిమాలో ఉన్నాయి.

అయితే ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌ మెంట్‌ లేకపోవడం కాస్త మైనస్‌గా సినీ వర్గాల వారు అంటున్నారు.ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఉంటే ఈజీగా 50 కోట్ల వసూళ్లు నమోదు చేసేది అంటూ నాని అభిమానులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jersey Movie Collections- Related....