'జెర్సీ' ఫలితం తారుమారు.. బయ్యర్లు బలి అయినట్లేనా?  

Jersey Movie Business Buyers In Losses-jersey Budget,nani,కాంచన 3,జెర్సీ ఫలితం

నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్న ఈ చిత్రం మొదటి రెండు మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టింది. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ చిత్రంను ఆహా ఓహో అన్నారు. దాంతో బయ్యర్లు బయట పడ్డట్లే అనుకున్నారు..

'జెర్సీ' ఫలితం తారుమారు.. బయ్యర్లు బలి అయినట్లేనా?-Jersey Movie Business Buyers In Losses

కాని అనూహ్యంగా బయ్యర్లు అన్ని ఏరియాలకు కలిపి 7 నుండి 10 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి ఉంది. సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేని కారణంగా బి,సి క్లాస్‌ ప్రేక్షకుల నుండి ఆధరణ కరువు అయ్యింది

పెద్ద పెద్ద సినిమాలే కొట్టుకు పోతున్నాయి. అలాంటి సునామిలో జెర్సీ కూడా కొట్టుకు పోతుంది. ఎవెంజర్స్‌ రాకతో మల్టీప్లెక్స్‌లో కూడా జర్సీకి కలెక్షన్స్‌ మందగించాయి.

చాలా స్క్రీన్స్‌ నుండి తొలగించడం జరిగింది. దారుణమైన పరిస్థితులు ఉన్న జెర్సీ బయ్యర్లు లబోదిబో మంటున్నారు.

నిర్మాతలు మాత్రం భారీ మొత్తానికి బయ్యర్లకు అమ్మేశారు.

సినిమాతో దాదాపుగా 50 కోట్ల బిజినెస్‌ చేశారు. 20 కోట్ల పెట్టుబడి పెట్టి 50 కోట్ల రూపాయలను తమ ఖాతాలో నిర్మాతలు వేసుకున్నారు. దాదాపుగా 30 కోట్ల లాభాలు వీరికి వచ్చాయి, కనుక బయ్యర్లను కొద్దో గొప్పో ఆదుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే జెర్సీ నిర్మాతలను బయ్యర్లు కలుస్తారని సమాచారం అందుతోంది.