నాని హీరోయిన్ కూడా ఆ పని మొదలెట్టేసింది  

jersey actress enters restaurant business - Telugu, Jersey Movie, Kannada Cinema, Kollywood, Tollywood

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే సినిమా తప్ప వేరొక లోక తెలియదు.తమ ఆర్ధిక లావాదేవీలు అన్ని తల్లిదండ్రులు చూసుకునేవారు.

TeluguStop.com - Jersey Actress Enters Restaurant Business

కొంత మందికి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, లేదంటే బంధువులు చూసుకునే వారు.అయితే అప్పటి హీరోయిన్స్ కెరియర్ కూడా సుదీర్ఘకాలం సాగేది.

అయిన కూడా జీవిత చరమాంకంలో చాలా మంది హీరోయిన్స్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇప్పుడు హీరోయిన్స్ విషయంలో అలాంటి పరిస్థితి ఎవరికీ వచ్చే అవకాశాలు లేవని చెప్పాలి.

TeluguStop.com - నాని హీరోయిన్ కూడా ఆ పని మొదలెట్టేసింది-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుత రోజుల్లో హీరోయిన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.ప్రతి ఏడాది కొత్త కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

దీంతో హీరోయిన్స్ కెరియర్ ఐదేళ్ళకి మించి ఉండటం లేదు.

అది కూడా స్టార్ హీరోయిన్స్ విషయంలో మాత్రమే.

కొంత మంది హీరోయిన్స్ అయితే కెరియర్ మొత్తం చూసుకున్న పది, పదిహేను సినిమాలకి మించి చేయలేరు.ఈ నేపధ్యంలో డిమాండ్ ఉన్నప్పుడు ఆర్ధికంగా స్థిరపడాలని భావిస్తున్న హీరోయిన్స్ కేవలం సినిమాని మాత్రమే నమ్ముకోకుండా ఇతర మార్గాలలో ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తూ కెరియర్ ముగిసాక ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పటికే తమన్నా జ్యూయిలరీ వ్యాపారంలో అడుగుపెట్టగా, రాకుల్ జిమ్ సెటర్లు స్టార్ట్ చేసింది.మిగిలిన హీరోయిన్స్ కూడా ఏదో ఒక వ్యాపారం మొదలుపెడుతున్నారు.

ఇప్పుడు వీరి దారిలో నానితో జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ చేరిపోయింది.తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈమె తాజాగా సలాడ్ బార్ అండ్ కేఫ్, పెర్సి ని చెన్నై లో ప్రారంభించింది.

ఇక తన వ్యాపారానికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి ప్రచారం కూడా మొదలెట్టేసింది.

#JerseyActress #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jersey Actress Enters Restaurant Business Related Telugu News,Photos/Pics,Images..