పవన్ కళ్యాణ్ సాంగ్స్ లో, అతని మాటల్లో ఊపుకి తెలుగునాట జనం పూనకాలు తెచ్చుకుంటారు అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ స్టామినా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సినిమాలలో కొన్ని సాంగ్స్ గూస్ బాంబ్స్ గా ఉంటాయి.
ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ పెర్ఫార్మెన్స్ తోడైతే ఇక చూసేవారికి పూనకాలు వచ్చేయడం గారంటీ.ఇప్పుడు అలాంటి అరుదైన ఫీట్ ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటేషన్ లో చోటు చేసుకుంది.
జెన్నిఫర్ లోపెజ్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఈ డాన్స్ లో ఇండియా తరుపున ముంబై నుంచి ఓ డాన్స్ బృందం మాసివ్ పెర్ఫార్మెన్స్ చేసింది.
ఇక ఈ షోలో గణపతి సాంగ్ తో స్టార్ట్ చేసి భీభత్సమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన టీం ఫైనల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ లో వాడెవడన్నా… వీడెవడన్నా సర్దార్ అన్నకి అడ్డు ఎవడన్నా అనే సాంగ్ తో ముగించారు.
ఇక ఈ సాంగ్ లో బీట్ కి డాన్సర్స్ మూమెంట్ కి ఒక్కసారిగా డాన్స్ ఫ్లోర్ మొత్తం సౌండ్స్ తో దద్దరిల్లింది.ఇక ఈ పెర్ఫార్మెన్స్ చూసిన హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ లోపెజ్ కూడా లేచి మరీ చప్పట్లు కొట్టి ఆశ్చర్యంగా వారి పెర్ఫార్మెన్స్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిందో చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది.