ప్రియుడికి బ్రేకప్ చెప్పి.. మరొకరితో సింగర్?

ప్రముఖ అమెరికన్ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె సింగర్ గా ఎంతో గుర్తింపు సొంతం చేసుకుంది.

 Hollywood Singer And Actor Jennifer Lopez Break Up Her Engagement ,  Jennifer Lo-TeluguStop.com

అంతేకాకుండా డ్యాన్సర్ గా బాగా ఆకట్టుకుంది.తాను నిర్మాతగా కూడా చేయగా.

మరోవైపు వ్యాపార రంగంలో కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది.ఇదిలా ఉంటే ఈమె తన ప్రియుడికి బ్రేకప్ చెప్పి మరోసారి వార్తల్లోకెక్కింది.

జెన్నిఫర్ కు ఇదివరకే మూడు పెళ్లిళ్లు జరుగగా.వారందరికి విడాకులు కూడా ఇచ్చేసింది.అంతే కాకుండా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇదిలా ఉంటే ఆమె గత కొన్ని సంవత్సరాల నుండి ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్ తో సహజీవనం చేసింది.

అంతేకాకుండా వీళ్ళు గత ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకోగా.కరోనా సమయం వల్ల తన పెళ్లి వాయిదా పడింది.

ఇదిలా ఉంటే గత వారం తాము ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇదివరకే నిర్ణయించుకోగా.

Telugu Alex Rodriguez, America, Breakup, Hollywood, Jennifer Lopez, Madison Lecr

తాజాగా ఆ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు యూఎస్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి కారణం ఏంటంటే చార్మ్ స్టార్ మాడిసన్ లెక్రోయ్ తో జెన్నిఫర్ ప్రియుడు అలెక్స్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని.అందుకే జెన్నిఫర్ అతనితో ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది.

ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రాకపోగా.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి .అంతేకాకుండా ఈ జంట గత ఏడాది మాయామిలో 40 మిలియన్ డాలర్ల ఇంటిని కొనడంతో అందరి దృష్టి కి బాగా ఆకట్టుకున్నారు.ఇక ప్రస్తుతం జెన్నీఫర్ లోపేజ్ డొమినికన్ రిపబ్లిక్ లో షూటింగ్ లో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube