రూ.39లకే కరోనా ట్యాబ్లెట్..!?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు దారుణంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కరోనా ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధకులు రాత్రి పగులు కష్టపడుతున్నారు.

 Jenburkt Pharma, Corona Virus Drug, Rs 39 Per Tablet, Jenburkt Pharmaceuticals ,-TeluguStop.com

ఆక్సఫర్డ్ వ్యాక్సిన్, రష్యా వ్యాక్సిన్ సక్సెస్ అయ్యాయని అవి ఈ ఏడాది చివరికి వస్తాయని ప్రకటించారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్సలో సమర్థవంతంగా పని చేస్తున్న మెడిసిన్ లో ఒకటి అయినా ”ఫావిపిరవిర్‌” ట్యాబ్లెట్ల ధరలు భారీగా తగ్గాయి.

దేశీయ జెనెరిక్‌ మందు తయారీ కారణంగా ఇలా భారీగా తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.రూ.39కే కరోనా ట్యాబ్లెట్‌ అందిస్తాం అని జెన్‌బర్క్‌ ఫార్మాసూటికల్స్‌ కంపెనీ తెలిపింది.
ఒక్కో ట్యాబ్లెట్‌ 200 మిల్లీగ్రాముల సామర్ధ్యం కలిగి ఉందని, ఒక్కో స్ట్రిప్ లో 10 ట్యాబ్లెట్లు వస్తాయని వారు తెలిపారు.

ఇంకా ఒక్కో టాబ్లెట్ కేవలం 39 రూపాయిలు అని ఈ టాబ్లెట్ ను ఫావివెంట్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు తెలిపారు.ఇంకా ఈ విషయాన్నీ కంపెనీ చైర్మన్‌ ఆశిశ్‌ యూ భూటానే ప్రకటించారు.

ఈ ఫావిపిరవిర్‌ మందుల తయారీకి సిప్లా ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతిని ఇచ్చింది అని వారు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube