వార్తల్లోకి జెఫ్ బెజోస్ ... ‘రివర్స్‌ ఏజింగ్‌’‌కు యత్నం, మీడియాలో విస్తృతంగా కథనాలు

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఏం చేసినా మీడియాలో పెద్ద వార్తయి కూర్చొంటున్న సంగతి తెలిసిందే.అపర కుబేరుడిగా ప్రపంచంలోని ప్రభావ శక్తుల్లో ఒకరిగా ఆయనకు ఆమాత్రం వుండకపోతే ఎలా.? ఇటీవల అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు.అదే ‘‘రివర్స్ ఏజింగ్’’.20లలో ఉన్నట్లుగా అందమైన దేహాన్ని, అదే శక్తిని జీవితాంతం నిలుపుకోవాలని భావించేవారు కోట్లాది మంది వున్నారు.ఇందుకోసం బ్యూటీ పార్లర్లు, కాస్మోటిక్ సర్జరీలు, మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

 Jeff Bezos Wants To Reverse Ageing, But Is The World Equipped To Handle Immortal-TeluguStop.com

పలువురు సెలబ్రెటీలు ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారన్నది బహిరంగ రహస్యం.ప్రకృతికి విరుద్ధంగా చేసే ఎలాంటి పనైనా సరే వికటించి తీరుతుందన్నది వాస్తవం.

అయితే వైజ్ఞానిక రంగంలో అభివృద్ధి, సాంకేతికత కారణంగా అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాడు మనిషి.ఇప్పటికే తల్లి గర్భాన్ని పోలిన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి టెస్ట్ ట్యూబ్ బేబీ విధానంతో సంతానాన్ని పొందుతున్నారు.

వైద్యశాస్త్రంలో చోటుచేసుకున్న గణనీయమైన అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు మనుషుల వృద్ధాప్యాన్ని నిరోధించే దిశగా పరిశోధనలను ముమ్మరం చేస్తున్నాయి.వయసును వెనక్కి మళ్లించే ‘రివర్స్‌ ఏజింగ్‌ ‘ కాన్సెప్ట్‌పై ప్రయోగాలు చేయడానికి ఇప్పటికే పలు కంపెనీలూ పుట్టుకొచ్చాయి.

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన వృద్ధాప్యాన్ని నిలువరించుకునేందుకు అమెరికాలో రివర్స్‌ ఏజింగ్‌‌పై ప్రయోగాలు చేస్తున్న ‘ఆల్టోస్‌ ల్యాబ్స్‌’కు ఇటీవల కోట్లాది రూపాయలను ముట్టజెప్పారు.అలాగే గూగుల్‌, ఒరాకిల్‌ సంస్థల అధిపతులు కూడా ‘రివర్స్‌ ఏజింగ్‌’పై ఇప్పటికే వందల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు.

Telugu Parlors, Equippedhandle, Cosmetic, Google, Israeli, Jeff Bezos, Oracle Co

జీవితంలో ఒక దశకు చేరుకున్నాక వయసును స్తంభింపజేసి, అక్కడి నుంచి వయసును యవ్వన దశకు వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియనే ‘రివర్స్‌ ఏజింగ్‌’ అంటారు.మన శరీరంలోని కణాల మధ్య నిత్యం సమాచార మార్పిడి జరుగుతుంది.అయితే, ఏళ్లు గడిచే కొద్దీ ఆ సమాచారం అందిపుచ్చుకునే సామర్ధ్యం తగ్గుతుంది.దీన్ని నివారించగలిగితే యవ్వనం సొంతం చేసుకోవచ్చన్నది శాస్త్రవేత్తల విశ్వాసం.ఇప్పటికే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో కొంతమేర విజయవంతమయ్యారు.రానున్న కాలంలో ఈ ప్రయోగాలు మరింత జరిగి.20ల నాటి కాంతులీనే శరీరాన్ని సొంతం చేసుకుంటామని పలువురు బల్ల గుద్ది చెబుతున్నారు.ఇదే జరిగితే భవిష్యత్‌లో ఈ భూమ్మీద ఎక్కడా ముసలి వారు కనిపించరేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube