మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా జెఫ్ బెజోస్..!

గత కొద్ది రోజులుగా టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మాస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనిక వ్యక్తిగా తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నాడు.

 Amazon, Ceo, Bezos, Richest Person In The World,elan Mask,tesla Company,viral Ne-TeluguStop.com

ఈ విషయాన్ని తాజాగా ఫోర్బ్స్ రియల్ టైం డేటా తెలియజేసింది.మంగళవారం నాటికి జెఫ్ బెజోస్ ఆదాయం 3.9 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలియజేసింది.

జనవరి నెలలో ఎలాన్ మస్క్ జెఫ్ బెజోస్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు.

అమెజాన్ ఫౌండర్ తన వ్యక్తిగత సంపదతో పాటు మరోవైపు తనకు సంబంధించిన అమెజాన్ సంస్థలోని అత్యధిక వాటాలు ఉండడంతో తాజాగా ఆయన సంస్థకు సంబంధించి షేర్ ధరలు ఆకాశానికి పెరగడంతో ఈ మైలురాయిని మళ్లీ ఆయన అందుకున్నాడు.వీటితో పాటు మరిన్ని టార్గెట్స్ అందుకునేందుకు బెజోస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి గత సంవత్సరం ఆగస్టు నెలలో 200 బిలియన్ డాలర్లకు మంచి ఆదాయాన్ని ఆయన కూడగట్టుకున్నారు.

ఇక గత సంవత్సరం చివరిలో అతడు తన కంపెనీ పదవినివదిలేందుకు రెడీ అయినట్లు కనిపించినా, ఆ సమయంలోనే అతడు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా ఎదిగాడు.

ఒకవేళ తాను పదవి నుండి వైదొలిగినప్పటికీ తాను స్థాపించిన కంపెనీపై తాను ఎప్పుడూ తను వేసి ఉంచుతానని బెజోస్ తెలుపుతున్నాడు.కేవలం అమెజాన్ పై మాత్రమే కాకుండా ఇతర ప్రాజెక్టుల పైన తన ఫోకస్ పెడుతున్నట్లు దాంతో మరింత ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.

ఇందులోభాగంగానే బి జోష్ ద వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఆరిజన్ రాకెట్ కంపెనీలపై ఫోకస్ పెడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube