సాయి పల్లవి అందుకే స్టార్ అయ్యిందట!  

sai pallavi, jeevitha rajashekar, sri reddy, controversey - Telugu Controversey, Jeevitha Rajashekar, Sai Pallavi, Sri Reddy

సాయి పల్లవి.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలంగాణ యాసతో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Jeevitha Rajashekar Says That Reason Only Makes Sai Pallavi As Heroine

ఎలాంటి అందాల ఆరబోత లేకుండా కేవలం తన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకుంది సాయి పల్లవి.ప్రస్తుతం విజయవంతంగా కెరియర్ ని నెట్టుకొస్తున్న సాయి పల్లవి స్వతహాగా డ్యాన్సర్.

ఒకప్పుడే ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ ప్రోగ్రాంలో డ్యాన్సర్ గా స్టెప్పులు వేసి అదరగొట్టింది.అలాంటి ఈ భామ డ్యాన్సర్ గా సెట్ అయినప్పటికీ నటిగా సెట్ అవ్వదు అని అప్పట్లో అనుకుంది.

TeluguStop.com - సాయి పల్లవి అందుకే స్టార్ అయ్యిందట-Movie-Telugu Tollywood Photo Image

కానీ ఆమె ఓ లోకల్ అడ్వేర్టైజ్మెంట్ లో వర్క్ చెయ్యడం, దాన్ని చూసి ఓ డైరెక్టర్ ఫోన్ చేసి ఆమెకు అవకాశం ఇవ్వడంతో ఆమె ఇలా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఆ అవకాశం ఎవరు ఇచ్చారో తెలుసా? మళయాళం ప్రేమమ్ సినిమా డైరెక్టర్.ఈ సినిమాతో ఆమె కేవలం మళయాళం ప్రేక్షకులనే కాకుండా సౌత్ ఇండియా అభిమానులను సొంతం చేసుకుంది.ఎంతో క్యూట్ గా కనిపించి మంచి నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకుంది.

ఇక అలానే ఫిదా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది సాయి పల్లవి.

ఇక ఈ నేపథ్యంలోనే గతంలో శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడింది.

ఆ సమయంలోనే సాయి పల్లవి గురించి సంచలన విషయాలు చెప్పింది. ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తున్నారు.

కానీ ఎవరైతే అద్భుతంగా నటించగలరో వారు మాత్రమే అవకాశాలు అందుకుంటున్నారు మిగితా వారికి అవకాశాలు రావు అది ఎవరైనా కూడా.సాయి పల్లవి ఒక్క సినిమాతోనే తానేంటో నిరూపించుకుంది కాబట్టే తనకు అన్ని అవకాశాలు వచ్చాయ్ అని జీవిత రాజశేఖర్ సంచలన విషయాన్నీ ప్రజలకు చెప్పింది.

#Sri Reddy #Sai Pallavi #Controversey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jeevitha Rajashekar Says That Reason Only Makes Sai Pallavi As Heroine Related Telugu News,Photos/Pics,Images..