జీవిత దర్శకత్వంలో మూడో సారి రాజశేఖర్

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ చివరిగా కల్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా పర్వాలేదని టాక్ తెచ్చుకున్న ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

 Jeevitha Rajasekhar Third Time Direct To Her Husband, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

అయితే ఎప్పటికప్పుడు హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీ అవుదామని రాజశేఖర్ అనుకుంటున్నారు.అయితే సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపధ్యంలో గతంలో మాదిరి ఎలా పడితే అలా సినిమాలు చేయకుండా తన బాడీ లాంగ్వేజ్ ని సరిపోయే కథల మీదనే శ్రద్ధ చూపిస్తున్నారు.దీనికోసం రీమేక్ కథల మీద కూడా దృష్టిపెడుతున్నారు.

ఇక రాజశేఖర్, నీలకంఠ కాంబినేషన్ లో నెక్స్ట్ సినిమా ఉండబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది.మలయాళీ హిట్ మూవీని నీలకంఠ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు.

అయితే ఇప్పుడు ఉన్నపళంగా ఆ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు తప్పుకున్నాడు.క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి నీలకంఠ తప్పుడుకోవడంతో ఆ బాధ్యతలని జీవిత రాజశేఖర్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
గతంలో జీవిత రాజశేఖర్ నటించిన ఎవడైతే నాకేంటి సినిమాకి దర్శకత్వం బాధ్యతలు నిర్వహించింది.దర్శకుడు వి సముద్ర కొంత సినిమా అయినా తర్వాత ఏవో కారణాల వలన తప్పుకోవడం మిగిలిన భాగం జీవిత దర్శకత్వం వహించి పూర్తి చేసింది.

తరువాత సత్యమేవ జయతే అనే సినిమాకి జీవిత పూర్తి స్థాయి దర్శకురాలిగా పని చేసింది.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.అయితే తరువాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ రీమేక్ మూవీ కోసం జీవిత తన భర్తని దర్శకత్వం చేయనుంది.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఉస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube