ఆయన సాయంతో మేము గెలవలేదు.. జీవిత సంచలన వ్యాఖ్యలు  

Jeevitha Rajasekhar Sensational Comments On Nagababu-jeevitha Rajasekhar,maa Elections,nagababu,జీవిత రాజశేఖర్‌

మా ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్‌పై నరేష్‌ ప్యానల్‌ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ విజయంలో మెగా బ్రదర్‌ నాగబాబు కీలకంగా వ్యవహరించాడు అనేది అందరు చెప్పే మాట. ముఖ్యంగా ఓడిపోయిన శివాజీ రాజా తన ఓటమికి పూర్తి కారణం నాగబాబు అంటూ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది..

ఆయన సాయంతో మేము గెలవలేదు.. జీవిత సంచలన వ్యాఖ్యలు-Jeevitha Rajasekhar Sensational Comments On Nagababu

తాను గెలిచే స్థితిలో ఉన్న సమయంలో నాగబాబు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొత్తం పరిస్థితి మార్చేశాడు అంటూ శివాజీ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇదే సమయంలో నాగబాబు తమకు మద్దతు ఇవ్వడం వల్ల గెలిచినట్లుగా మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ చెప్పుకొచ్చాడు. ప్రమాణ స్వీకారం సమయంలో కూడా మెగా బ్రదర్‌కు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.

కాని తాజాగా నరేష్‌ ప్యానల్‌ తరపున పోటీ చేసి గెలిచిన జీవిత రాజశేఖర్‌ మాత్రం తాజాగా తమ విజయంకు నాగబాబు కారణం కాదంటే కాదంటూ తేల్చి పాడేసింది.

తమపై నమ్మకంతో మా సభ్యులు ఈ విజయంను అందించారని, తాము ఈ విషయం గురించి ఆందోళన చెందలేదు. నాగబాబు గారు మద్దతు ఇవ్వకున్నా మేము గెలిచే వాళ్లం. శివాజీ రాజా ప్యానల్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగానే తమకు విజయం దక్కిందని, అందులో ఆయన గొప్పదనం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి నాగబాబు వల్ల గెలిచిన జీవిత ఇలా మాట్లాడటంపై మెగా ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.