నా కూతురు లేచిపోయిందని ప్రచారం చేశారు.. జీవిత రాజశేఖర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి కల్మషం లేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్.ఈయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

 Jeevitha Rajasekhar Reaction On The Remours News About Her Daughter Jeevitha Rejasekhar, Tollywood, Comment, Daughter, Shivani, Shekar Movie, Rajashekar , Shivatmika-TeluguStop.com

ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల హృదయాలను సొంతం చేసుకున్నాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన తన భార్య జీవిత దర్శకత్వం లో ‘శేఖర్‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.జీవిత కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన నటియే.

 Jeevitha Rajasekhar Reaction On The Remours News About Her Daughter Jeevitha Rejasekhar, Tollywood, Comment, Daughter, Shivani, Shekar Movie, Rajashekar , Shivatmika-నా కూతురు లేచిపోయిందని ప్రచారం చేశారు.. జీవిత రాజశేఖర్ కామెంట్స్ వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నటిగా దూరమయ్యాక దర్శకురాలిగా బాధ్యతలు చేపట్టింది.ఇక ఈ సినిమాకు బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఇక ఈ సినిమా ఈ నెల 20న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.దీంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ప్రమోషన్స్ భాగంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి చాలా విషయాలు పంచుకుంటున్నారు.

ముఖ్యంగా ఇటీవలే సినీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఈవెంట్ లో రాజశేఖర్ కుటుంబం మాట్లాడిన మాటలు బాగా వైరల్ గా మారాయి.ముఖ్యంగా జీవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం ఓ రేంజ్ లో దుమారాన్ని రేపాయి.

ఓ వర్గంకు చెందినవారు జీవిత తమ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసింది అనడంతో వెంటనే క్షమాపణలు చెప్పేసింది జీవిత.అంతే కాకుండా తను ఒకలాగా అంటే.ఇంకో ఉద్దేశ్యంలో ప్రచారం చేస్తున్నారు అని అన్నది జీవిత రాజశేఖర్.ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలి అని తెలిపింది.

Telugu Rajashekar, Shekar, Shivani, Shivatmika, Tollywood-Latest News - Telugu

ఇక తమ కుటుంబం గురించి కూడా లేనిపోని అసత్యాలు క్రియేట్ చేస్తున్నారు అని మండిపడింది.తన మీద వచ్చినన్ని వార్తలు వేరే వాళ్ల మీద రావేమో అని అన్నది.మొన్నీమధ్య తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ కి వెళ్ళింది అని పుకార్లు సృష్టించారు అని అన్నది.ఓసారి శివాత్మిక పేరు అంటారు.మరోసారి శివాని ప్రియుడితో పారిపోయింది అంటారు.తీరా వార్త ఓపెన్ చేస్తే ఆ టైటిల్ కు, లోపల ఉన్న సమాచారానికి సంబంధం ఉండదని తెలిపింది.

తమ ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్ కి వెళ్ళాము అని.దానికే ప్రియుడితో దుబాయ్ కి లేచి పోయారని వార్తలు రాశారు అంటూ మండిపడింది.

ఇటువంటి అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతున్నాయి అని.ఇంకా గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉందని.కోర్టులో తేలకముందే ఏదో చెబుతున్నారు అని.నిజంగా తప్పు చేశాను అంటే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి.ఎవరు కాదనం.కాని తప్పులు తెచ్చుకోకుండా అసత్యాలను ప్రచారం చేయకండి అని వ్యాఖ్యలు చేసింది జీవిత.ఇక తన దర్శకత్వంలో విడుదల కానున్న శేఖర్ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో.ముఖ్యంగా రాజశేఖర్ కు ఎటువంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube