ఆ వస్తువును మూడుసార్లు పోగొట్టుకున్న హీరో రాజశేఖర్.. చివరకు

ప్రతి ఒక్కరూ కొన్ని సెంటిమెంట్లను తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు.కొంతమందికి కొన్ని వస్తువులు సెంటిమెంట్లుగా ఉంటాయి.

 Jeevitha Rajasekhar Interesting Comments About Shivalingam , Jeevitha Rajasekhar-TeluguStop.com

సీనియర్ హీరో రాజశేఖర్ కు ఇద్దరు కూతుళ్లు కాగా ఒక కూతురు పేరు శివాని మరో మరో కూతురు పేరు శివాత్మిక అనే సంగతి తెలిసిందే.కూతుళ్లు అంటే రాజశేఖర్ కు ఎంతో ఇష్టం కాగా శివాని, శివాత్మిక కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ హీరోయిన్లుగా కేరీర్ ను కొనసాగిస్తున్నారు.

శివానికి అద్భుతం సినిమా మంచి పేరు తెచ్చిపెడితే శివాత్మికకు దొరసాని సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.శివుడిపై ఉండే ఇష్టం వల్లే జీవిత రాజశేఖర్ దంపతులు తమ కూతుళ్లకు శివుడి పేరు కలిసేలా పేర్లు పెట్టుకున్నారు.

కొడుకు పుడితే ఈ దంపతులు శివ అని పేరు పెట్టుకోవాలని అనుకున్నారు.రాజశేఖర్ శివ భక్తుడినని షోలో జీవిత వెల్లడించారు.

రాజశేఖర్ మెడలో ఒక శివలింగం ఉంటుందని ఆ శివలింగం ఇప్పటికి మూడుసార్లు మిస్సై దొరికిందని జీవిత చెప్పుకొచ్చారు.

శివుడిపై ఉండే ఇష్టం వల్ల బంగారంతో చిన్న శివలింగం చేయించుకున్నారని జీవిత అన్నారు.

చైన్ తో ఉండే ఆ శివలింగం తొలిసారి పోగొట్టుకున్న సమయంలో దొరికిందని జీవిత వెల్లడించారు.ఆ తర్వాత రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ సిటీలో శివలింగాన్ని పోగొట్టుకున్నారని ఆ శివలింగం దొరకదని భావించగా మళ్లీ దొరికిందని జీవిత కామెంట్లు చేశారు.

అల్లరి ప్రియుడు షూటింగ్ సమయంలో కూడా ఆ శివలింగం పోయిందని జీవిత చెప్పుకొచ్చారు.

అయితే ఆ సమయంలో కూడా పోగొట్టుకున్న శివలింగం మళ్లీ దొరకిందని ఆమె తెలిపారు.ఏదో రీజన్ వల్లే రాజశేఖర్ మూడుసార్లు వస్తువును పోగొట్టుకున్నా దొరికిందని జీవిత అన్నారు.హీరో రాజశేఖర్ శివలింగం సెంటిమెంట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube