'మ'కి జీవిత, రాజశేఖర్ రాజీనామా!

ఇండస్ట్రీలో అందరికి ఒక దారి అయితే జీవిత, రాజశేఖర్ దంపతులది ఒక దారి.మిగిలిన అందరిది ఒక దారి.

 Jeevitha Rajasekhar Chiranjeevi Mohan Babu-TeluguStop.com

ఇండస్ట్రీలో ఎక్కువగా వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్న వీళ్ళు తాజాగా జరిగిన మా అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.రాజశేఖర్ స్టేజ్ మీద చేసిన న్యూసెన్స్ పై చిరంజీవి, మోహన్ బాబు సీరియస్ అయ్యారు.

తరువాత దీనిపై జీవిత క్షమాపణలు చెప్పింది.అయితే ఈ ఇష్యూ తర్వాత వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే విధంగా మా పెద్దలు మాట్లాడారు.

ఇదిలా ఉంటే మా సభ్యుత్వానికి జీవిత, రాజశేఖర్ రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సమావేశంలో తమకి జరిగిన అవమానం నేపధ్యంలో కూతుళ్ళతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

వాళ్ళ రాజీనామాని ప్రకటించకపోయిన దానిపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళు మీడియా ముందుకి వచ్చి తమ రాజీనామా విషయాన్ని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.మొత్తానికి మా అసోసియేషన్ గొడవలతో మరోసారి మీడియాలో ఈ రోజు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube