బండ్ల గణేష్ చిన్నపిల్లాడిలా చేస్తున్నాడు.. జీవిత రాజశేఖర్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి ప్రకాష్ రాజ్ ఆదివారం తన ప్యానెల్ సభ్యులతో ఒక హోటల్ లో సమావేశమైన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మా ఎన్నికలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయం గురించి సమావేశమై పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ అనంతరం మా సభ్యులకు విందు ఏర్పాటు చేశారు.

 Jeevitha Rajasekha Over Bandla Ganesh Latest Video On Maa Elections,  Jeevitha R-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సమావేశం పై బండ్ల గణేష్ స్పందిస్తూ కరోనా సమయంలో ఆర్టిస్టులందరిని ఒక చోటకు చేర్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ విధంగా బండ్ల గణేష్ వీడియో పై నటి జీవితా రాజశేఖర్ స్పందిస్తూ బండ్లగణేష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

కరోనా నిబంధనలను పాటిస్తూ ఇప్పటివరకు ఎన్నో పెళ్ళిళ్ళు, రాజకీయ ఎన్నికలు, శుభకార్యాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రజలలో కరోనా గురించి అవగాహన వచ్చింది.కోవిడ్ రాకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలుసు.

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్లు కూడా వేయించుకుంటున్నారు.బయట ఏదైనా సమావేశంలో కలిసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలను పాటిస్తూ సమావేశాలలో పాల్గొంటున్నారని జీవిత తెలియజేశారు.

Telugu Bandla Ganesh, Corona, Hotel, Jeevithabandla, Maa, Prakash Raj, Tollywood

మా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న విషయం గురించి సమావేశం అయ్యాము అయితే ఇక్కడ వేల సంఖ్యలో జనాలు రావడం లేదు, ఇక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం లేదు ప్రాథమికంగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశానికి హాజరయ్యామని, బండ్ల గణేష్ వీడియో చూస్తే ఆయన చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు జీవిత స్పందిస్తూ అతని వ్యాఖ్యలను ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube