మద్దతు ఇచ్చిన నాగబాబుకు వెన్ను పోటు పొడిచిన స్టార్‌ దంపతులు

ఇటీవల హోరా హోరీగా జరిగిన మా ఎన్నికల్లో నరేష్‌ ప్యానల్‌కు మెగా బ్రదర్‌ నాగబాబు బాహాటంగానే మద్దతు పలికిన విషయం తెల్సిందే.నాగబాబు మద్దతుతో నరేష్‌ ప్యానల్‌ గెలుపొందింది.

 Jeevitha And Rajasekhar Comments On Nagababu In Politics-TeluguStop.com

నాగబాబు మద్దతు కారణంగానే జీవిత రాజశేఖర్‌లకు మాలో కీలక పదవి దక్కింది.రాజశేఖర్‌ దంపతులకు మా ఎన్నికల ముందు నాగబాబు చాలా సాయం చేశాడని చెప్పుకోవాలి.

నాగబాబు వల్లే మొత్తం ఎన్నికల సీన్‌ మారిపోయింది.చిరంజీవి సలహా మేరకు నాగబాబు మీడియా ముందుకు వచ్చి నరేష్‌ ప్యానల్‌కు మద్దతు తెలిపాడు అనేది చాలా మంది మాట.

నాగబాబు అంత సాయం చేస్తే ఇప్పుడు జీవిత రాజశేఖర్‌లు ఆయనకు వెన్ను పోటు పొడిచారు.మరీ దారుణంగా ఆయన రాజకీయ అరంగేట్రంపై దెబ్బ కొడుతున్నారు.మొదటి సారి ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబుకు వ్యతిరేకంగా రాజశేఖర్‌ దంపతులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ప్రస్తుతం రాజకీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.భారీ ఎత్తున నాగబాబు ప్రచారం చేస్తూ ఉంటే ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా విమర్శలు చేయడం జరుగుతోంది.

నాగబాబుపై రాజశేఖర్‌ దంపతులు విమర్శలు చేయడంను సినీ వర్గాల వారు కొందరు తప్పుబడుతున్నారు.నెల రోజుల క్రితం ఆయన మద్దతు తీసుకుని, ఆయన వల్ల గెలిచిన మీరు ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజశేఖర్‌ దంపతులది నమ్మక ద్రోహం, వెన్ను పోటు అంటూ రాజకీయ వర్గాల వారు మరియు సినీ వర్గాల వారు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube