జీవిత, రాజశేఖర్‌ లకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే  

  • టాలీవుడ్‌లో జీవిత రాజశేఖర్‌ల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. వారికి మంచి పేరైతే ఉంది కాని, ఆర్థికంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. రాజశేఖర్‌ హీరోగా చేసిన సినిమాలకు జీవిత నిర్మాణ భాగస్వామిగా ఉన్న కారణంగా పలు సినిమాలు నష్టపోయేలా చేశాయి. భారీ బడ్జెట్‌తో చేసిన సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో పాటు, ఏ ఒక్క సక్సెస్‌ కూడా రాజశేఖర్‌కు దక్కక పోవడంతో వీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో వీరు తిత్లీ బాధితులకు ఆర్థిక సాయంను ప్రకటించడంపై అంతా కూడా చర్చించుకుంటున్నారు.

  • Jeevitha And Rajasekhar 10 Lac Donations For Titli Toofan-

    Jeevitha And Rajasekhar 10 Lac Donations For Titli Toofan

  • ఈమద్య కాలంలో సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ లు దక్కించుకుని, కోట్లల్లో లాభం దక్కించుకున్న వారు ఎవరు కూడా తిత్లీ తుఫాన్‌ బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. కాని నష్టాల్లో ఉండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజశేఖర్‌ ఒక మంచి ఉద్దేశ్యంతో, మంచి మనసుతో ఇలా సాయం చేయడం అభినందనీయంగా చెబుతున్నారు. తిత్లీ బాధితుల సహాయార్థం రాజశేఖర్‌ దంపతులు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన నేపథ్యంలో ఇతర స్టార్స్‌ కూడా ఆయన దారిలో నడవాలంటూ సూచిస్తున్నారు.

  • Jeevitha And Rajasekhar 10 Lac Donations For Titli Toofan-
  • తిత్లీ బాధితులకు ఇప్పటి వరకు టాలీవుడ్‌ సెలబ్రెటీల నుండి పెద్దగా సాయం అందడం లేదు. రామ్‌ చరణ్‌, విజయ్‌ దేవరకొండ, నందమూరి హీరోలు ఇలా కొంత మంది మాత్రమే సాయంను అందించారు. ఇంకా చాలా మంది తిత్లీ గురించి కనీసం స్పందిచను కూడా లేదు. టాలీవుడ్‌లో తాము టాప్‌ అని చెప్పుకునే వారు ఇప్పటి వరకు ఎలాంటి సాయంను ప్రకటించలేదు. అలాంటి సమయంలో రాజశేఖర్‌ దంపతుల సాయం అందరికి ఆదర్శనీయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే రాజశేఖర్‌ దంపతులకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.