కేసీఆర్ - జగన్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జీవిత రాజశేఖర్ ధర్నా..!!  

సీనియర్ నటి జీవిత రాజశేఖర్ తాజాగా కేసిఆర్ -జగన్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేపడుతూ రోడ్డెక్కారు.బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం నినదించారు.

TeluguStop.com - Jeevita Rajasekhar Dharna Against Jagan Kcr Governments

హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర యజ్ఞం పవన్ ఆధ్వర్యంలో జీవిత రాజశేఖర్ ఈ ధర్నా నిర్వహించారు.బ్రాహ్మణ సత్యాగ్రహ దీక్షపేరిట జరుగుతున్న ఈ దీక్షను ఉద్దేశించి జీవిత రాజశేఖర్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పై మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడి పోయిన అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించకుండా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేసీఆర్ – జగన్ సర్కార్ లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

TeluguStop.com - కేసీఆర్ – జగన్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జీవిత రాజశేఖర్ ధర్నా..-Political-Telugu Tollywood Photo Image

మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు అవుతున్నాయని కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నట్లుగా జీవిత రాజశేఖర్ కామెంట్లు చేశారు.అంతేకాకుండా మల్లాది పవన్ యజ్ఞం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడం నిజంగా సంతోషం అంటూ పేర్కొన్నారు.

ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేణుగోపాల చారి రిజర్వేషన్ అమలు గురించి సీఎం తో మాట్లాడతానని హామీ ఇవ్వటంతో దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

.

#YS Jagan #Indira Park #SeniorActress #Hyderabad #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jeevita Rajasekhar Dharna Against Jagan Kcr Governments Related Telugu News,Photos/Pics,Images..