పవన్ ని టార్గెట్ చేసిన జీవిత రాజశేఖర్! అప్పుడు వైఎస్ కోసం ఇప్పుడు జగన్ కోసం  

పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన జీవిత రాజశేఖర్. .

Jeevita Rajasekhar Comments On Janasena-congress,janasena,jeevita Rajasekhar Comments,tdp,ysrcp

 • ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాలని దీటుగా ఎదుర్కొంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. అయితే జనసేన కారణంగా తమ విజయావకాశాలు దెబ్బ తుంటున్నాయని భావించిన వైసీపీ అతనిని ఎదుర్కోవడానికి నేరుగా సినిమా నటులని రంగంలోకి దించింది.

 • పవన్ ని టార్గెట్ చేసిన జీవిత రాజశేఖర్! అప్పుడు వైఎస్ కోసం ఇప్పుడు జగన్ కోసం-Jeevita Rajasekhar Comments On Janasena

 • పవన్ కళ్యాణ్ ని తాము టార్గెట్ చేస్తూ ప్రజలలో అతనిని సింపతీ పెరుగుతుందని, అలాగే తమపై ప్రజలలో ఓ రకమైన వ్యతిరేకత వస్తుందని వైసీపీ భావించి తనకి మద్దతుగా నిలబడే సినీ నటులని హుటాహుటిన పార్టీలో చేర్చుకోవడం మొదలెట్టింది.

  అలాగే పవన్ కళ్యాణ్ కి సన్నిహితంగా ఉండేవారిని కూడా తన పార్టీలోకి ఆహ్వానించి వారితో పవన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయించడం మొదలెట్టింది.

 • అయితే పవన్ సన్నిహితంగా ఉండే అలీ, కోన వెంకట్ పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఆసక్తి చూపించక పోవడంతో, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉండే జీవిత రాజశేఖర్ దంపతులని రంగంలోకి దించారు. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేయడం మొదలెట్టారు.

 • Jeevita Rajasekhar Comments On Janasena-Congress Janasena Jeevita Tdp Ysrcp

  గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో వైఎస్సార్ కూడా ఇదే పంథాలో వెళ్లి సినిమా నటులని, ముఖ్యంగా జీవిత, రాజశేఖర్ దంపతులని ఎన్నికల ముందు రంగంలోకి దించి చిరంజీవి మీద విమర్శలు చేయించారు. మళ్ళీ ఎన్నికల ముందు వీళ్ళిద్దరిని తెర ముందుకి తీసుకొచ్చి జనసేన మీద మీద విమర్శలు చేయడం మొదలెట్టారు. అయితే ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ దంపతులని వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇలా ఎన్నికల ముందు తమ ప్రత్యర్ధి పార్టీలపై ఎదురుదాడి చేయించడానికి మాత్రమే ఉపయోగించుకుంటుంది.

 • Jeevita Rajasekhar Comments On Janasena-Congress Janasena Jeevita Tdp Ysrcp

  తరువాత వారిని పట్టించుకోవడం మానేస్తారు అంటూ రాజకీయ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో జగన్ నుంచి వారికి చేదు అనుభవం ఎదురైన కూడా మళ్ళీ పాతగూటికి వెళ్ళడం వెనుక వారి స్వప్రయోజనాలు ఉన్నాయని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయ వర్గాలలో జీవిత రాజశేఖర్ దంపతులపై వినిపిస్తున్న కామెంట్స్ కి వాళ్ళ సమాధానాలు ఎలా ఉంటాయో చూడాలి.