ఆ కాంగ్రెస్ సీనియర్ నోచ్చుకున్నారా ? నచ్చ చెప్పినా లాభం లేదా ? 

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ప్రకటించి చాలా రోజులే అయింది.అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేసారు.

 Jeevan Reddy Who Is Still At Logger Heads Over Congress On Tpcc To Revanth Reddy-TeluguStop.com

అయినా ఆ పీఠం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఇంకా అలకపాన్పు వీడి నట్టుగా కనిపించడం లేదు.తన నియామకం పై సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అలక చెందారు అనే విషయాన్ని కనిపెట్టిన రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులను వరుసగా కలుస్తూ వారి మద్దతును కూడగడుతున్నారు.

ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు మెత్తబడినా,  మరికొంత మంది సీనియర్లు మాత్రం ఈ విషయం తగ్గేదే లేదు అంటూ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

ముఖ్యంగా రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యేలతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు తీవ్ర స్థాయిలో హైకమాండ్ పై విరుచుకు పడ్డారు.

ఒక దశలో పార్టీకి రాజీనామా చేసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నించారు.అలాగే ఈ పిసిసి పదవి దక్కుతుందని చివరివరకు ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంకా ఆగ్రహం గానే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే రేవంత్ నియామకంపై ఆయన అలక చెందారా లేక పార్టీ హైకమాండ్ నిర్ణయం పై ఆగ్రహంగా ఉన్నారా అనేది తెలియక పోవడంతో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఈ విషయంపై దృష్టి పెట్టారు .

Telugu Aicc, Congress, Jeevan Reddy, Komati Venkata, Manikyam Tagore, Pcc, Revan

గతం నుంచి జీవన్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించేందుకు సిద్ధమైంది.ఆ సమయంలోనే మాణిక్యం ఠాకూర్ సైతం జీవన్ రెడ్డి కి పదవి దాదాపు ఖాయమని చెప్పేయడం,  ఆ తర్వాతి పరిణామాల్లో రేవంత్ రెడ్డికి పిసిసి దక్కడంతో జీవన్ రెడ్డి అసహనంతో ఉన్నారట.
  ఇదే విషయమై మాణిక్యం ఠాకూర్ జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన సందర్భంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అప్పట్లో తన పేరుని ప్రకటిస్తామని హడావుడి చేసి తర్వాత ఆ ప్రతిపాదనలను పక్కనపెట్టి మరెవరికో అధ్యక్ష పదవి కట్టబెట్టారని, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మళ్లీ నన్ను అడగడం ఎందుకు అంటూూూ టాగూర్ పై  ఆగ్రహం వ్యక్తం చేయడంతో సైలెంట్ అయిపోయారు.

Telugu Aicc, Congress, Jeevan Reddy, Komati Venkata, Manikyam Tagore, Pcc, Revan

పిసిసి అధ్యక్ష పదవి కాకపోయినా, రాష్ట్ర స్థాయి లో ఏదో ఒక కీలకమైన పదవి ఇస్తారు అనుకున్నాా , ఆ సంకేతాలు కనిపించకపోవడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో  ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube