తెలంగాణ కాంగ్రెస్ లో సైలెంట్ గా జీవన్ రెడ్డి వ్యవహారం..అలక వీడేనా?

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తరువాత కాంగ్రెస్ లో అతి మామూలుగా ఉండే వర్గ విభేదాలు పెద్దగా బయటికి రాలేదనే  చెప్పవచ్చు.ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి పది రోజుల ముందుగా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లను కలసి పార్టీ పటిష్టతకు వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.

 Jeevan Reddy Affair In Telangana Congress Silently Alaka Veedena, Mlc Jevan Redd-TeluguStop.com

దీంతో కాంగ్రెస్ లో అందరూ ఒక్కటయ్యారనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.అయితే పీసీసీ చీఫ్ పదవి ఆశించిన ఎమ్మెల్సీ జీవన రెడ్డి లాంటి వ్యక్తులు రేవంత్ కు  పీసీసీ చీఫ్ ను ఇవ్వడాన్ని అధిష్టానం దగ్గర వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

Telugu Jeevan Reddy, Jeevanreddy, Telangana-Political

అయితే ఇప్పుడు ఇక పరిస్థితులన్నీ ఇక రేవంత్ వైపు ఉండటంతో ఇక జీవన రెడ్డి ఒక్కడిగా పోరాడి చేసేది ఏమీ లేదన్న పరిస్థితి ఉండటంతో ఇక తానూ మెట్టు దిగి కలిసి రాక తప్పేలా లేదు.ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక కసరత్తు కమిటీలో జీవన రెడ్డి పేరు ఉండటంతో ఇక తిరిగి అందరితో పాటు కలసి కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది.అయితే ఇక కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికను నామ మాత్రంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది.స్వయంగా రేవంత్ రెడ్డి హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెలవడం కష్టం అనే తరహాలో మాట్లాడటంతో అనధికారికంగా కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube