దృశ్యం సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఒరిజినల్ దర్శకుడు  

Jeethu Joseph Mohan Lal Meena Drishyam - Telugu Jeethu Joseph Has Plans To Make A Sequel To Drishyam, Malayalam Movies, Meena, Mohan Lal, South Cinema, Tollywood

మలయాళంలో మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ లో దృశ్యం సినిమాని జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించారు.ఫ్యామిలీ ఎమోషన్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు సుమారు అన్ని ప్రాంతీయ భాషలలో రీమేక్ అయ్యింది.

 Jeethu Joseph Mohan Lal Meena Drishyam

అలాగే హిందీతో పాటు, చైనా, సింహళీ భాషలలో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యింది.ఇక అన్ని భాషలలో సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఒక కామన్ మెన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు నేది ఇందులో కథాంశం.

దృశ్యం సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఒరిజినల్ దర్శకుడు-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మలయాళీ సినిమాకి సీక్వెల్ ని ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ఇక ఈ సీక్వెల్ లో మొదటి భాగంలో నటించిన మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో నటించనున్నారు.మిగిలిన పాత్రలతో పాటు కథ మొత్తం మారిపోతుందని తెలుస్తుంది.

మొదటి సినిమా తరహాలో ఇది కూడా ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలతో తెరకెక్కే థ్రిల్లర్ కథగానే ఉంటుందని తెలుస్తుంది.మరి మొదటి సినిమా తరహాలో ఈ సీక్వెల్ కూడా అద్భుతమైన విజయం అందుకుంటుందో లేదో చూడాలి.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు