కొడుకు జేఈఈ టాపర్ వచ్చాడు... తండ్రి అరెస్ట్ అయ్యాడు!

గత నెలలో జరిగిన జేఈఈ పరీక్షలలో అస్సాం రాష్ట్రానికి చెందిన నీల్ నక్షత్ర దాస్ 99.8 శాతం మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు.అయితే నీల్ నక్షత్ర దాస్, అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిల్ నక్షత్ర దాస్ స్థానంలో మరొక అభ్యర్థితో పరీక్ష రాయడం వల్ల అతనిని, అందుకు ప్రోత్సహించినందుకు గాను తన తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 Jee Mains Assam Topper And His Father Arrested Accused Of Forging Fake Candidate-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల మేరకు….

గత నెలలో జరిగిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్స్ లో టాపర్ గా నిలిచిన అభ్యర్థి తన స్థానంలో వేరొకరితో పరీక్ష రాయించడం వల్ల టాపర్ గా నిలిచాడు అనే ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అంతేకాకుండా అతని తండ్రి డాక్టర్‌ జ్యోతిర్మేదాస్‌తో పాటు పరీక్ష కేంద్రంలో ఇందుకు సహకరించిన హేమేంద్రనాథ్ శర్మ, ప్రంజల్ కలిత, హిరులాల్ పాథక్ అనే ముగ్గురు ఉద్యోగులపై అనుమానం రావడంతో దర్యాప్తు జరిపి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపి ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న దాని గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

పరీక్ష రోజున నిందితుడు పరీక్ష కేంద్రానికి వచ్చి అతని రోల్ నెంబర్, పేరు రాసి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడంతో, ఆ స్థానంలోకి మరొక వ్యక్తి వచ్చి పరీక్ష రాసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ విషయం తెలియడంతో పోలీసులు పరీక్ష కేంద్రాన్ని సీజ్ చేశారు.

మిత్రాదేవ్ శర్మ అనే వ్యక్తి ఈ నెల 23న ఈ సమాచారం గురించి పోలీసులకు తెలియజేయడంతో, ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శర్మ ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్ వైరల్ కావడంతో నీల్ నక్షత్ర దేవ్ నకిలీ అభ్యర్థి చేత పరీక్ష రాయించినట్లు బయటపడింది.

ప్రస్తుతం నీల్ నక్షత్ర దాస్ ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube