జగన్ వ్యూహకర్తకి షాక్ ఇచ్చిన జేడీయూ! పార్టీ నుంచి గెంటివేత

ఏపీ రాజకీయాలలో ఎన్నికలకి ముందు భాగా వినిపించిన పేరు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్.పొలిటికల్ ఎనలిస్ట్ గా వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఓ విధంగా ప్రజలని కులాల వారీగా, వర్గాల వారీగా విడగొట్టి సోషల్ మీడియా ద్వారా ఎదుటి పార్టీలపై అసత్య ఆరోపణలు విస్తృతంగా ప్రచారం చేయించి, జనాల్లోకి వైసీపీ వ్యతిరేక పార్టీల మీద వ్యతిరేకత పెంచే విధంగా చేసి సక్సెస్ అయ్యారు.

 Jdu Suspended On Prashant Kishor-TeluguStop.com

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలతోనే, అలాగే ఆయన ఇచ్చిన సలహాలతోనే జగన్ ఎన్నికల ప్రచారంతో కొత్త ఒరవడిలో వెళ్లి ప్రజలని ఆకర్షించి భారీ ఆధిక్యం తెచ్చుకొని గెలుపొందారు.

ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడుగా ఎదగడానికి తన సొంత రాష్ట్రంలో నితీష్ కుమార్ నాయకత్వంలో జీడీయూ పార్టీలో చేరారు.

ఆ పార్టీలో చేరిన తర్వాత నితీష్ కుమార్ అతనికి పార్టీ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చి గౌరవించారు.అయితే గత కొంత కాలంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నితీష్ కుమార్ కి, పీకేకి కొన్ని విషయాలలో అసలు పొసగడం లేదు.

బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ పార్టీలో ఉన్న ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా సిఏఏ విషయంలో కూడా బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశాడు.

ఈ నేపధ్యంలో పార్టీ స్టాండ్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూన్న పీకేకి నితీష్ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు అతనిని బహిష్కరించారు.పార్టీ నుంచి బయటకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ దేవుడే జేడీయూని కాపాడాలంటూ ట్వీట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube