జేడీ పార్టీ మారిపోతున్నారా ? రాజ్యసభ సభ్యుడు అవుతారా ?

తన హోదానే ఇంటిపేరుగా మార్చుకుని తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుత జనసేన నాయకుడు వీవీ లక్ష్మినారాయణ రాజకీయ ప్రస్థానం గురించి చాలా రోజులుగా చాలానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.జనసేన పార్టీలో ఆయన ఉన్నా ఆయన మనసు మాత్రం వేరే పార్టీ వైపు చూస్తోందని, ఆయన పార్టీ మారిపోవడం తధ్యమని అనేక కధనాలు వినిపించాయి.

 Jdlaxminarayana Join In Bjpparty Vearysoon Janasena-TeluguStop.com

అయితే అవన్నీ వట్టి పుకార్లేనని ఆయన ఖండించారు.జనసేన పార్టీ మీద జేడీ అసంతృప్తితో రగిలిపోతున్నారని, పవన్ కు ఆయనకు పొసగడంలేదని అనేక వార్తలు వినిపించాయి.

అయితే అవన్నీ వట్టి పుకార్లే అని ఆ పార్టీ తరపున కూడా ఖండనలు కూడా వచ్చాయి.అయినా ఆయన వైకిరి మీద జనాలకు నమ్మకం కలగలేదు.

ఎన్నికల ముందు లక్ష్మి నారాయణ కోసం చాలా పార్టీలే ప్రయత్నించాయి.వైసీపీ మినహా అంతా జేడీని తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించాయి.

ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు.పవన్ ఆయనకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆయన నిజాయితీ పరుడిగా అక్కడి ప్రజల కు తన హామీలను బాండు పేపర్‌పై రాసి ఇవ్వడం, తనను నిలదీయమని చెప్పడం వంటివి అప్పట్లో సంచలనం సృష్టించాయి.

జనసేన పార్టీలో ఎవరు గెలిచినా గెలవకపోయినా జేడీ గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు.కానీ ఫలితాలు మాత్రం ఆయన్ను నిరాశపరిచాయి.

Telugu Janasena, Jdlaxminarayana, Pawan Kalyan, Vishakapatanam-Telugu Political

  అయితే ఓటమి తరువాత జేడీ విశాఖను మాత్రం వదల్లేదు.తాను విశాఖ ప్రజల మధ్యే ఉంటానని, ప్రజల సమస్యలపై దృష్టి పెడతానని చెప్పి ఆ విధంగానే చేస్తున్నారు.అయితే ఈ సమయంలోనే జేడీకి పవన్ కు మధ్య అభిప్రాయం బేధాలు వచ్చాయని, ఆయన పార్టీ మారిపోవడం తధ్యం అని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన మీద బీజేపీ పార్టీ కన్ను వేసినట్టు ప్రచారం జరుగుతోంది.చాలాకాలంగా ఆయనకు బీజేపీ నుంచి రకరకాల ఆఫర్లు వస్తున్నా ఆయన మాత్రం సైలెంట్ గానే రాజకీయం నడుపుతున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ వేసిన కమిటీల్లో జేడీకి స్థానం దక్కకపోవడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారట.ఇక జనసేన విషయాన్ని పక్కన పెట్టి ఆయన తన సొంత సేవ సేవ సంస్థ జేడీ ఫౌండేషన్ మీద దృష్టిపెట్టి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

జేడీ అనుసరిస్తున్న ఈ మౌనం ఏంటో, దాని వెనుక ఉన్న వ్యూహం ఏంటో తెలియక అంతా తర్జన భర్జన పడుతుండగానే ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారని, కాకపోతే ఆ పార్టీలో చేరేందుకు రాజ్యసభ టికెట్ అడిగారని, దీనిపై బీజేపీలో చర్చ సాగుతోందని ఇది ఓకే అయితే, పార్టీ మారేందుకు ఆయన సిద్ధమని ప్రచారం మొదలయ్యింది.అయితే ఈ విషయంపై బీజేపీ కూడా ఆలోచనలో ఉందట.

జేడీ వంటి నాయకుడు బీజేపీలో చేరితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న క్లిన్ ఇమేజ్ బీజేపీకి కలివస్తుందని భావిస్తున్నారట.అవసరం అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయన్నే సీఎం అభ్యర్థిగా కూడా ముందు పెట్టి ఎన్నికలకు వెళ్తే ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించవచ్చేనే వ్యూహాంలో బీజేపీ ఉందట.

ప్రస్తుతానికి జేడీ అడిగిన రాజ్య సభ సీటు ఇచ్చేందుకు అగ్ర నాయకత్వం కూడా సముకంగానే ఉన్నట్టు త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube