అంతవరకూ తెచ్చుకోవద్దు....బాబు కి జేడీ హెచ్చరిక   JD Laxminarayana Warns AP CM Chandrababu Naidu     2018-07-20   11:27:59  IST  Bhanu C

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయా..? బీజేపీ అష్టదిగ్భంధనం ఫలిస్తోందా..త్వరలో ఏపీలో ఒక భారీ ఉద్యమానికి పరిస్తితితులు దారి తీయనున్నాయా..? అంటే అవుననే చెప్పాలి..ఏపీ సీఎం చంద్రబాబు కి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ , నిన్నటి వరకూ కలిసి మెలిసి ఉన్న జనసేన..మాజీ సీబీఐ జేడీ లు కొరకరాని కొయ్యగా తయారాయ్యారనే చెప్పాలి..ఎందుకంటే..ఒక పక్క జగన్ తనదైన శైలిలో చంద్రబాబు పై విమర్శలు చేస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ తన పాదయాత్రలో బాబు టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కుతుంటే

మరో వైపు చంద్రబాబు పై జగన్ చేసిన ఆరోపణలు కంటే కూడా జనసేన గుంటూరు మొదలు సభలు పెట్టి మాట్లాడే ప్రతీ సారి బాబు చేస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయాయి..ఇక పవన్ కళ్యాణ్ చేతిలో బాబు కి మూడిందని అంతా అనుకుంటున్న సమయంలో జేడీ ఎంట్రీ పెద్ద షాక్ ఇచ్చినా ఆయన సైలెంట్ గా తన పనేదో తానూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే ఈ క్రమంలోనే 13 జిల్లాలో రైతుల సమస్యలని తెలుసుకుంటూ వారి భాధలని వింటున్న జేడీ సీఎం వద్దకి వీరి సమస్యలని తీసుకుని వెళ్తా సానుకూలంగా స్పందిస్తే ఒకే లేదంటే

రైతులు అందరినీ సంఘటితం చేస్తాను మహారాష్ట్ర లో జరిగిన విధంగా రైతులతో కలిసి పాదయాత్ర చేస్తాను అని చెప్పారు..మహారాష్ట్రలో రైతు ఉద్యమం తర్వాత తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. ఏపీలో నా ప్రజలకి అలాంటి రాదు నేను అలాంటి పరిస్తితితుల్లో రైతులను చూడాలనుకోవడం లేదన్నారు…అయితే ఏపీలో రైతు సమస్యలు గనుకా పరిష్కారం కాకపొతే తప్పకుండా మహారాష్ట్ర లో జరిగిన రైతు ఉద్యమాన్ని ఏపీలో ను బాబు చూడాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు…

రైతుకు కనీస మద్దతు ధర కోసం అవకాశం ఉన్నంత వరకూ పోరాటం చేస్తానని..అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాను రెండు ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దానని తెలిపారు జేడీ అయితే ఇప్పుడు జేడీ హెచ్చరిక బాబు లో గుబులు పుట్టిస్తోంది,..ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న జేడీ ఇప్పుడు కత్తి పీక మీద పెట్టినట్టుగా చేస్తారా లేదా అంటూ స్వరం పెంచాడు అంటే తప్పకుండా ఏపీలో కీలక మార్పులకి జేడీ శ్రీకారం చుట్టడానికి సిద్దంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది అంటున్నారు పరిశీలకులు..అయితే జేడీ త్వరలో ఎలాంటి నిర్ణయాన్ని ఫైనల్ చేయబోతున్నారో వేచి చూడాల్సిందే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.