పొత్తు మంచిదే అంటున్న జేడీ  

Jd Laxminarayana Comments On Janasena And Bjp Alliance-janasena Leader Jd Laxmi Narayana,jd Laxminarayana

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం జనసేన పార్టీలో ముఖ్య నేతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఇటీవలే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ నాయకులను కలిసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.

JD Laxminarayana Comments On Janasena And BJP Alliance-Janasena Leader Jd Laxmi Narayana

అయితే కొందరు వీరి పొత్తుపై విమర్శలు చేస్తున్నారు.ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని, మొన్నటి వరకు మోడిని మరియు బీజేపీ నాయకులను తిట్టిన పవన్‌ ఎలా ఆ పార్టీతో కలుస్తాడు అంటూ ప్రశ్నిస్తున్న సమయంలో ప్రముఖ నేతగా ఉన్న జేడీ లక్ష్మినారాయణ మాత్రం బీజేపీతో కలవడంపై పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యాడు.


జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మంచి పరిణామం అన్నాడు.తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

రాజధాని మార్పు అంశం న్యాయస్థానంలో ఉంది, దాన్ని న్యాయస్థానం చూసుకుంటుంది అన్నాడు.ప్రజలకు ఆమోదయోగ్యమైన రాజధాని కావాలంటూ ఈ సందర్బంగా జేడీ అన్నాడు.

వచ్చే ఎన్నికల సమయంకు జనసేనను బలమైన రాజకీయ పార్టీగా మార్చేందుకు తమ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు

Jd Laxminarayana Comments On Janasena And Bjp Alliance-janasena Leader Jd Laxmi Narayana,jd Laxminarayana Related....