జనసేనలోకే.. 'జేడీ'... సర్వం సిద్దం..!

ఎంతోకాలం నుంచీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ పై ఎన్నో రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి ఆయన సొంతగా పార్టీ పెడుతారని కొదరు అంటే.మరి కొందరు మాత్రం జేడీ తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు మరొకొందరు అయితే కాదు కాదు బీజేపీ కావాలని జేడీ ని ఏపీ సీన్ లోకి దింపిందని బీజీపీ అభ్యర్ధిగా జేడీ ఉంటారని కీలక భాద్యతలు జేడీ చేపడతారని ప్రచారం జరిగింది కానీ ఇప్పటికి కూడా జేడీ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ రాలేదు.అయితే

 Jd Laxmi Narayan Joining Into Janasena-TeluguStop.com

విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.జేడీ జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందని తప్పకుండా జనసేన తరుపున జేడీ కీలకనేటగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత ఏపీలో ఎన్నో సమస్యలపై అధ్యయనం చేశార.ముఖ్యంగా జేడీ ఏపీ లో ఉన్న రైతుల సమస్యలపై తన దృష్టిని కేంద్రీకరించారు ఏపీలో రైతులు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ,పంటలకి తగినంత లాభం లేకపోవడంతో ఆర్ధికంగా నష్టపోతున్నారని , దాంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతున్నారని తెలియడంతో జె.డి చలించిపోయారు.

13 జిల్లాల్లో రైతుల సమస్యలపై వారి పరిస్థితులపై అధ్యయనం చేశారు వీటన్నిటికీ పరిష్కారాలను కూడా జేడీ సిద్ధం చేశారు.తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండాలని కోరికను కూడా బయటపెట్టారు.ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా రైతుల సమస్యలపై పోరు బాట పట్టడం ఎన్నోసార్లు రైతుల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేయడం జరిగింది.

అయితే జెడి ఎంచుకున్న మార్గం జనసేన అధినేత పాటిస్తున్న మార్గాలు ఒక్కటి కావడం పైగా తాను ఏ పార్టీలో కి వెళ్లాలని ఆలోచిస్తున్న తరుణంలో నీతి నిజాయితీతో కూడిన ఎటువంటి అవినీతి మరక అంటుకొని పార్టీ ఏపీలో జనసేన ఒక్కటే కనిపిస్తుంది.

సుదీర్ఘమైన నీతి నిజాయితీతో కూడుకున్న ఉద్యోగ విషయంలో ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొని జెడి ఇప్పుడు తను ఇంటర్ ఇవ్వబోయే రాజకీయ టీ కూడా తన భవిష్యత్తు జీవితానికి మచ్చ రాకుండా ఉండేలాగా ఉండాలని డిసైడ్ అయ్యారట.దాంతో జెడి ఎంట్రీపై ఉన్న సందిగ్ధత తొలగి పోయినట్లు అయింది.పరిస్థితుల్లో జేడీ భావజాలానికి తగ్గట్టుగా ఉన్న ఏకైక పార్టీ జనసేన కావడంతో విశ్లేషకులు సైతం జె.డి జనసేన లోకి వెళ్తారని అంచనా వేస్తున్నారు.కాగా ఈనెల మూడో వారంలో జీడి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube