రాజధానిగా విశాఖ: జనసేన జేడీ స్పందన ఇదే

విశాఖను ఎగ్జికుటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంపై జనసేన కీలక నాయకుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ స్పందించారు.జగన్ ప్రకటించిన మూడు రాజధానులు, విశాఖను ఎగ్జికుటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంపైనా ఆయన్ను ప్రశ్నించగా విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు.

 Jd Lakshminarayana Respond To Vizag Capital Issue-TeluguStop.com

సచివాలయ సిబ్బంది కోసం అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయింపులు జరుగుతాయని, అంతకుమించి అక్కడేమీ జరగదంటూ ఆయన చెప్పుకొచ్చారు.ప్రభుత్వ ఆఫీసు ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని దీనిని ప్రజలంతా గుర్తుంచుకోవాలని జేడీ సూచించారు.

సచివాలయం ఏర్పాటు చేయడం వల్ల విశాఖ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు.ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ అని లక్ష్మి నారాయణ అన్నారు.

కేవలం ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయడంవల్లనే అభివృద్ధి చెందుతుందని అనుకుంటే ప్రతి జిల్లాకు ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందేవాళ్ళం కదా అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఎక్కడా విశాఖను రాజధానిగా అంగీకరిస్తున్నారా ? వ్యతిరేకిస్తున్నారా అనే విషయం తేల్చకుండా పై విధంగా మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube