అనుకున్నట్లుగానే జనసేన కు జేడీ హ్యాండ్ ఇవ్వబోతున్నారా!  

Jd Lakshminarayana Likely To Quit Janasena Party-

గత కొద్దీ రోజులుగా జనసేన పార్టీ కీలక నేత,మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జనసేన కు గుడ్ బై చెప్పబోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ముందు ఎంత హుషారుగా పాల్గొని ప్రచారం చేశారో ఓటమి పాలైన తరువాత కనీసం వార్తల్లో కూడా కనిపించలేదు.

Jd Lakshminarayana Likely To Quit Janasena Party--JD Lakshminarayana Likely To Quit Janasena Party-

అప్పటి నుంచి కూడా సైలెంట్ గా పార్టీ కార్యకలాపాలలో కూడా పాల్గొనకుండా తప్పుకొని తిరుగుతున్న జేడీ పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.ఆయన జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది.

Jd Lakshminarayana Likely To Quit Janasena Party--JD Lakshminarayana Likely To Quit Janasena Party-

ఆయనతో పాటు ఆయన అనుచరుడు గంపల గిరిధర్ కూడా కాషాయం వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది.గత ఎన్నికల ముందు వరకు కూడా జేడీ ఏ పార్టీ లో చేరతారు అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

కొన్ని సార్లు సొంత పార్టీ పెట్టి ముందుకు సాగుతాను అని చెప్పిన ఆయన గత ఎన్నికలకు సరిగ్గా కొద్దీ రోజుల ముందే అందరిని ఆశ్చర్యపరుస్తూ జనసేన లో చేరారు.అయితే 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయగా అందరూ జేడీ తప్పకుండా విజయాన్ని అందుకుంటారు అని భావించారు.కానీ అందరి అంచనాలు తారుమారు అవుతూ గత ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వడం తో జేడీ ఓటమి పాలయ్యారు.

అయితే ఓటమి తరువాత బయటకు కనపడకుండా ఉన్న జేడీ పార్టీ మారతారు అంటూ ప్రచారం జరిగినప్పటికీ ఎప్పుడూ కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న ఉద్దేశంతో జేడీ తో పాటు ఆయన అనుచరుడు కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.సీబీఐ జాయింట్ డైరెక్టర్‌లో అత్యంత కీలకమైన రాజకీయ కేసులను డీల్ చేసిన సమయంలో లక్ష్మీనారాయణకు పేరు వచ్చింది.

ఆ సమయంలో డిప్యుటేషన్ మీద వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత మహారాష్ట్ర కేడర్‌కు వెళ్లిపోయారు.కానీ, ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందే వాలంటరీగా తప్పుకొన్న ఆయన రాజకీయాలపై మొగ్గు చూపారు.