స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి జేడీ నాయకత్వం ? పిటిషన్ వెనుక ? 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ఆసక్తి కనబరడమే కాకుండా,  పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తామని,  ఇందులో వెనక్కి తగ్గేది లేదు అని పదే పదే ప్రకటనలు చేస్తోంది.కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము అడ్డుకుంటామని అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి.

 Jd Lakshminarayana To Play A Key Role In Steel Plant Movement , Vizag Steel Plan-TeluguStop.com

కానీ ఈ ఉద్యమంలో సీరియస్ గా  అయితే ఏ రాజకీయ పార్టీ పాల్గొనడం లేదు.దీనికి కారణం కేంద్రం అంటే భయం అనేది బహిరంగ రహస్యమే.

అందరికంటే ముందుగా ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో క్రెడిట్ కొట్టేందుకు టిడిపి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

కానీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళ విషయంలో అనుకున్నంత స్థాయిలో ఆయన యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా మాజీ జనసేన నాయకుడు, సి.బి.ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కీలక అడుగు వేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమయిన కేంద్రం నిర్ణయాన్ని ఆయన సవాల్ చేస్తూ, ప్రజా పయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇది బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇప్పటివరకు జేడి బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళరు అని అంతా అనుకున్నారు.

కానీ విశాఖ నుంచే మళ్లీ పోటీ చేసి ఎంపీ గా గెలవాలనే పట్టుదలతో ఉన్న జేడీ ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ద్వారా విశాఖ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని , తద్వారా పార్టీలతో సంబంధం లేకుండా తాను విశాఖ లో బలమైన నాయకుడుగా ఎదుగుతానని, అప్పుడు తాను అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడుతున్నారట.

Telugu Cbi Jd, Janasena, Pavan Kalyan, Steel, Visakha Steel, Vizag, Vizag Steel,

అందుకే కాస్త ఆలస్యంగా అయినా , ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమైపోయారు.ప్రస్తుతం వాటితో మాత్రమే సరిపెట్టకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు , కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకునేందుకు తగిన వ్యూహాలు రూపొందించినట్లు సమాచారం.కేవలం ఉద్యమంతో సరిపెట్టకుండా ఇప్పటికే జె.

డి విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అనేదానిపై కేంద్ర ప్రభుత్వానికి సైతం లఖలు రాశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube