వైజాగ్ మీటింగ్ తో పార్టీ మార్పుపై వస్తున్న విమర్శలకి జేడీ ఫుల్ స్టాప్

ఏపీ రాజకీయాలలో గత కొంత కాలంలో బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాజకీయ నేతలని తన పార్టీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగా ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బీజేపీ గూటికి చేరిపోతున్నారు.

 Jd Lakshminarayana Givesclarity Onpart Changewith Vizagmeeting-TeluguStop.com

అయితే జనసేన పార్టీ నుంచి కూడా బీజేపీలోకి వలసలు ఉంటాయని, మాజీ జేడీ, జనసేన నేత లక్ష్మినారాయణ బీజేపీలో చేరబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా అన్ని మీడియా సంస్థలు తెగ రచ్చ చేస్తున్నాయి.అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా మంది జేడీ లక్ష్మినారాయాణ జనసేనకి గుడ్ బై చెప్పేస్తున్నాడు.

అందుకే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నాడు అంటూ గాసిప్స్ వైరల్ చేస్తున్నారు.

అయితే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరిపోతారు అని ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు జేడీ లక్ష్మినారాయణ మీద పడటం మొదలెట్టింది.

ఈ విషయంలో పవన్ తాజాగా జనసేన పోలిట్ బ్యూరో కమిటీలు ఏర్పాటు చేసి జనసేన పార్టీ ప్రయాణం సాగుతుందని స్పష్టం చేసేసాడు.అయితే జేడీ విషయంలో జన సైనికులలలో అపోహలు సృష్టించడంలో అత్యుత్సాహం చూపిస్తున్న మీడియాకి లక్ష్మి నారాయాణ కూడా నేరుగా ఎవరికి సమాధానం చెప్పకుండానే తాజాగా విశాఖలో జనసేన తరుపున జీరో బడ్జెట్ పోలిటిక్స్ మీద మీటింగ్ పెట్టి జనసేన పార్టీ జీరో బడ్జెట్ పోలిటిక్స్ తో ఎలా ప్రయాణం చేయబోతుంది అనే విషయాన్ని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

ఇక ఈ సమావేశంలో జనసేన భీమిలి ఎమ్మెల్యే అభ్యర్ధి పంచకర్ల సందీప్ కూడా పాల్గొన్నాడు.దీంతో లక్ష్మినారాయణ జనసేన పార్టీని వీడుతున్నారు అనే వార్తలు కేవలం మీడియా సృష్టి అని తేలిపోయింది.

అయితే మీడియా మాత్రం లక్ష్మినారాయణ నేరుగా స్పందించేంత వరకు ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తూ ఆయన్ని బీజేపీలో కలిపేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అని జన సైనికులు చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube