జనసేనలోకి మాజీ జేడీ ! ముహూర్తం ఫిక్స్ !       2018-05-26   23:40:43  IST  Bhanu C

జగన్ అక్రమాస్తుల కేసులో బాగా పాపులర్ అయిన మాజీ సీబీఐ జాయింట్ కమిషనర్ లక్ష్మీనారాయణ రాజకీయ అరంగ్రేటం పై ఊహాగానాలు వీడాయి. చాలాకాలంగా ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలియక రకరకాల పుకార్లు వినిపించాయి. ఆయన కూడా సమయం వచ్చినప్పుడు చెప్తా అంటూ తప్పించుకుని తిరిగేవారు. అయితే ఆయన తొందరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలిసింది .

లక్ష్మీనారాయణ.. తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల క్రమంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆప్తుల దగ్గర చెప్పారు. పవన్ కల్యాణ్ పోరాటం నచ్చిందని.. అధికారం కోసం కాకుండా సామాజిక రాజకీయం, సామాజిక చైతన్యం కోసం వెళుతున్న దారి బాగుందని అన్నారంట. ఆ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారంట. అయితే చివరిగా మిత్రుల ఉద్దేశం కూడా తెలుసుకోవాలని ఈ విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించారు.

పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలోకి వెళ్లొచ్చుకానీ.. ఎప్పుడు వెళతారు అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి కూడా సమాధానం ఇచ్చారు. ఆగస్ట్ 14వ తేదీన జాయిన్ కావాలని ముహూర్తం పెట్టుకున్నారంట. దానికి కారణం ఏంటంటే.. ఆ రోజునే జనసేన పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. అదే సరైన సమయం అని భావిస్తున్నారంట. ఈ రెండు నెలలు కూడా జనసేన పార్టీ విధానాలు, పోరాటం చూసి.. మరిన్ని వ్యూహాలతో ఆగస్ట్ 14వ తేదీన ఆ పార్టీలో అధికారికంగా చేరాలని ఆయన చూస్తున్నాడు.

ఇప్పటివరకు ఆయన ప్రజల్లో తిరుగుతూ.. రైతులతో ముచ్చటిస్తూ ప్రజలనాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరుతున్నారని వార్తలు రావడంతో చాలా కాలంగా ఉన్న ఉత్కంఠ తొలగిపోయింది.