“పవన్” కి దిమ్మరితిగే షాక్ ఇవ్వనున్న “జేడీ”   JD Lakshmi Narayana Will Started Political Party     2018-03-24   01:53:16  IST  Bhanu C

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి..ఎ పార్టీ ఎవరితో జట్టు కడుతుందో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు..ఒక వైపు చంద్రబాబు నాయుడు కేంద్రం పై దండయాత్ర చేస్తుంటే మరో వైపు ఏపీలో పవన్ ,జగన్,బిజెపి. కలిసి చంద్రబాబు పై దండయాత్ర చేస్తున్నాయి..ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలు ఏపీలో ఎదురవుతాయో ఎవరికీ తెలియడంలేదు. అయితే జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగవిరమణ చేయనంతవరకూ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు..ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు..ఎందుకంటే జేడీ ఇప్పుడు రాజకీయలలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వెల్లివెత్తుతున్నాయి..

జేడీ ఏ పార్టీలోకి వెళ్తారో అంటూ అనేక ఊహాగానాలు వస్తున్న ఈ నేపధ్యంలో…తాజాగా వినిపిస్తున్న వార్తా ఎన్నో సంచలనాలకి కేంద్రం కాబోతోంది..ఇంతకీ ఏమిటా వార్తా అంటే..జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్ట్టనున్నారు..ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయల్లూ పెను సంచలనం అవ్వనుంది..రాజకీయ పార్టీ పెడితే ఎవరికీ నష్టం అనే విషయాలు ఇప్పటికే బేరీజు వేసుకుంటున్నారు…అయితే జేడీ పార్టీ పెడితే మాత్రం ఇబ్బంది పడేది మాత్రం పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు..ఎలా అంటే..

జేడీ కి ప్రజలలో చాలా క్లీన్ చీట్ ఉంది…అంతేకాదు దేశం కోసం దేశంలో ఉండే ప్రజల సంరక్షణ విషయాలలో పేద ప్రజలకి ఏదైనా చేయాలనే తపనలో జేడీ కి ఉన్న కమిట్మెంట్ అంతా ఇంతా కాదు..అంతేకాదు విద్యార్ధులలో..చదువుకున్న వారిలో ఉద్యోగస్తులలో జేడీ అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది..తన జీవితంలో ఇప్పటి వరకూ ఒక్క మచ్చ కూడా లేదు..ఎవరు కూడా వేలు ఎత్తి చూపకుండా తన ఇమేజ్ చాలా క్లీన్ గా ఉంది…అయితే జేడీ రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా నష్టం అనుకుంటే..జేడీ కి ఉన్న క్లీన్ ఇమేజ్ పవన కి లేదు అంతేకాదు పవన్ కి వేలెత్తి చూపడానికి బహు భార్యా విషయం నుంచీ అనేక విషయాలు ఉన్నాయి పవన్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉంది కేవలం యూత్ లో మాత్రమె ఉంది..ఎన్ని విధాలుగా చూసుకున్నా సరే పవన్ ఇమేజ్ కి జేడీ ఇమేజ్ కి ఎంతో తేడా ఉంది… ఇప్పుడు ఇవే కారణాలు పవన్ కి చాలా మైనస్ కానున్నాయి..దాంతో విశ్లేషకులు సైతం జేడీ ఎంట్రీ పవన్ కి భారీ డ్యామేజ్ తెచ్చి పెడుతుంది అంటున్నారు..