లాభం లేదు సొంత పార్టీ పెట్టేద్దాం ! ఫిక్స్ అయిపోయిన సీబీఐ మాజీ జేడీ

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి లక్ష్మీ నారాయణ.జగన్ అక్రమాస్తుల కేసులో విచారణాధికారిగా ఆయన వ్యవహరించిన తీరుతో అందరి ప్రశంసలు అందుకున్నారు.

 Jd Lakshmi Narayana To Start New Political Party-TeluguStop.com

ఆ తరువాత ఆయన మహారాష్ట్ర క్యేడెర్ కు వెళ్లిపోయారు.అయితే ఆ తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయిపోయి వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.ఆ తరువాత ఆయన ఏపీలోని అన్ని ప్రధాన పార్టీల్లోనూ చేరబోతున్నారు అంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి.అయితే…ఆయన మాత్రం ఏ పార్టీలో చేరబోతున్నారు అనే విషయంపై స్పందించలేదు సరికదా … సైలెంట్ గా జిల్లాల పర్యటనలు చేస్తూ… రైతులు .శ్రామికుల కస్టాలు తెలుసుకుంటూ … పర్యటనలకు పరిమితం అయ్యారు.

తాజాగా… ఆయన సొంత పార్టీ పెట్టాలనే ఓ నిర్ణయానికి వచ్చేసారు.ఈ సోమవారం 26 -11 -2018 ) ఆయన తన కొత్త పార్టీ జెండా, అజెండాను ప్రకటించబోతున్నారు.సత్యం కంప్యూటర్స్ కేసు, గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించి ఆంధ్రప్రదేశ్‌లో వీవీ లక్ష్మినారాయణ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

దీంతో ఆయనను తమ పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ అనేక ఆఫర్ లు ఇచ్చింది.రామ్‌మాధవ్ లాంటి నేతలు.నేరుగానే ఆహ్వానం పంపారు.మరో వైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా.

తమ పార్టీలో చేరి ఏపీ తరపున బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరింది.కానీ ఆయన మాత్రం సొంత పార్టీకే మొగ్గు చూపారు.

వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుందని ఆయన ఇప్పటికే అనేక సార్లు చెప్పారు.పీపుల్స్ మ్యానిఫెస్టో అంటూ ఆయన సొంతంగా ఒక అజెండా కూడా తయారుచేసుకున్నారు.అసలు మొదట్లోనే అంటే.ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడే సొంతంగా పార్టీ పెడతారని అంతా భావించారు.అయితే… అప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పెట్టడం కంటే ఏదో ఒక పార్టీలో చేరడమే బెటర్ అని ఆయన సైలెంట్ అయిపోయాడు.ఆ తరువాత జనసేన పార్టీ వైపు కూడా ఆయన వెళ్లేందుకు నిర్ణయించుకుని ఆ తరువాత పవన్ మనస్తత్వం అర్ధంకాక అటువైపు దైర్యంగా అడుగు వేయలేకపోయాడు.

ఇక ఆయన సంగతి అంతా పక్కనపెట్టిసిన సమయంలో ఇప్పుడు కొత్త పార్టీ అంటూ ఆయన ప్రకటించడం అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube