తెలుగు భాష పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!!

ఇటీవల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం జాతీయ విద్యా విధానం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మాతృభాష ప్రాముఖ్యత గురించి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

 Jd Lakshmi Narayana Sensational Comments On Telugu Language, Jd Lakshmi Narayana-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ  విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దాన్ని అమలు చేస్తూనే మరో పక్క ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని స్పష్టం చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న విద్యావిధానం చూస్తే కేవలం బట్టీ పట్టడం తప్ప నేర్చుకున్నా రీతిలో విద్యా విధానం లేదని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

ఇలాంటి తరుణంలో భావవ్యక్తీకరణ మాతృభాష పై పట్టు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.జాతీయ విద్యా విధానం అమలు చేయాలంటే కొన్ని ప్రమాణాలు కూడా పాఠశాలల్లో పాటించాలని లేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పరభాషలో విద్యా విధానం బోధించడం వల్ల .విద్యార్థులు అటు మాతృభాష ఇటు పరభాషా నేర్చుకో లేని పరిస్థితుల్లో ఉన్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Telugu Ap System, Cbse Syllabus, Jd Lakshmi Yana, Telugu Language, Virtual-Telug

వృత్తివిద్యా వంటివి ఆరవ తరగతిలోనే ప్రవేశ పెట్టడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారవుతారని సూచించారు.ప్రభుత్వాలు ఇలా చేయటం వల్ల పన్నెండవ తరగతి వచ్చే లోపు విద్యార్థులకు అవగాహన ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube