బాబు కి జేడీ ప్రశ్నల వర్షం..చెప్తారా..?? తప్పించుకుంటారా..??

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అసలు టైం బాగోలేదని చెప్పాలి.రాష్ట్రంలో ఏ నేతని బాబు గారి గురించి అడిగినా సరే చంద్రబాబు చేసిన తప్పుల తాలూకు చిట్టా తీసి గడగడా చదివేస్తున్నారు.

 Jd Lakshmi Narayana Questions To Chandrababu-TeluguStop.com

చంద్రబాబు కి గెలుపు భయం పట్టుకుందని విమర్శలు చేస్తున్నారు.అందుకే ఏమి చేయాలో తెలియక తికమకలో తన పరువుని పోగొట్టుకునే నిర్ణయాలని తీసుకుని 40 ఏళ్ల అనుభవాన్ని 4 నిమిషాలలో పోగొట్టుకున్నారు.

అయితే ఇక ఏపీలో చంద్రబాబు పై విమర్శలు చేయని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒక్కరే దాంతో ఆ లోటు కూడా పూడ్చేశారు జేడీ.

చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడుతూ.బాబు గారిపై ప్రశ్నల వర్షం కురిపించేశారు.జేడీ లేవనెత్తిన ప్రశ్నలు పాతవే అయినా సరే ప్రశ్నించింది జేడీ కాబట్టి ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు పదును పెరిగిపోయింది.

దాంతో ఏపీలో మరో మారు అధికారంలోకి రావాలని కలలు కంటున్న టీడీపీ అధినేతకి దిమ్మతిరిగే షాక్ తగిలినట్టు అయ్యింది.నిన్నా మొన్నటి వరకూ జగన్ , పవన్ లు టీడీపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న సమయంలో ఆ లిస్టు లోకి కొత్తగా మాజీ జేడీ కూడా జాయిన్ అయ్యారు.

ఇంతకీ జేడీ ఏమన్నారంటే… నిన్నటి రోజున హైదరాబాదులో జరిగిన ఒక సమావేశంలో జేడీ మాట్లాడుతూ నేను తానూ ఎవరో వదిలిన బాణం కాదలుచుకోలేదని.నేను విల్లుగా ఉండటానికి ఇష్టపడుతానని ప్రకటించారు.

ఉద్యోగ విరమణ చేసిన తరువాత రైతుల సమస్యలని తెలుసుకోవాలని దాదాపు అన్ని జిల్లాలలో సమస్యలపై అవగాహన తెచ్చుకున్నానని.ఆయన అన్నారు ఇదే క్రమంలో ఆయన చంద్రబాబు కి ప్రశ్నల వర్షం కురిపించారు.

చంద్రబాబు చేస్తున్న పాలనలో లోపాలని ఎత్తి చూపించారు.ప్రజా దానం మంచి నీళ్ళుగా ఖర్చు జరుగుతోందని, నవనిర్మాణ దీక్ష.పుష్కరాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం ఎందుకు తగలేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఏపీలో పోలీసులు ఉన్నారని సిబిఐ దర్యాప్తు అవసరం లేదని టీడీపీ ప్రభుత్వం అంటున్నప్పుడు ఎందుకు జగన్ పై దాడికి రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహించడం లేదని అన్నారు.

దాంతో భవిష్యత్తులో మరింతగా జేడీ బాబు ని టార్గెట్ చేయబోతున్నారు అంటూ సూచన ప్రాయంగా తెలుస్తోంది.మరి జేడీ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube