తూచ్... నేను మీ పార్టీలో చేరడం లేదు ! నేనే పార్టీ పెడుతున్నా

సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ రాజకీయ ప్రస్థానం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు.ఆయన అసలు ఏ పార్టీలో చేరతారో.

 Jd Lakshmi Narayana Not Joining Loksatta-TeluguStop.com

సొంతంగా పార్టీ పెడతారో ఎవరికీ అర్ధం కావడం లేదు.మొన్న ‘ తన పార్టీ పేరు ‘ జనధ్వని’ అంటూ… ప్రచారం చేసుకున్నారు.

ఇంకేముంది ఆ పార్టీ విధివిధానాలు… మ్యానిఫెస్టో ఇలా అన్నీ బయటకి వస్తాయని అంతా భావించారు.కానీ అకస్మాత్తుగా…ఆయన నేను పార్టీ పెట్టడం లేదు … లోక్ సత్తా పార్టీలో చేరబోతున్నాను అంటూ…ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

ఇంకేముందు ఆయన లోక్ సత్తా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు అని అందరూ అనుకున్నారు.అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చేసుకున్నారు.

జేడీ లోక్ సత్తాలో దాదాపు చేరడం ఖాయం అనుకున్న చివరి నిమిషంలో ఇలా ఒక్కసారిగా ….లక్ష్మి నారాయణ హ్యాండ్ ఇవ్వడం లోక్ సత్తా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.అసలు ముందుగా… జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తా ఆఫీస్‌కు రెండు మూడు సార్లు వెళ్ళి జయప్రకాశ్‌ నారాయణతో ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి, పార్టీ పెట్టడం గురించి చర్చించారట.

గత శుక్ర శని వారం నాడు జేడీ, జేపీలు సుదీర్ఘంగా జరిపిన చర్చల తర్వాత లోక్‌సత్తాలో చేరుతానని జేడీ ప్రకటించాడట.అందుకు జయప్రకాశ్‌నారాయణ కూడా అంగీకారం తెలిపారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా సభ ఏర్పాటు చేసి తనను జేపీ స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీలో చేరుతానని జేపీని కోరారని లోక్‌సత్తా నాయకులు చెబుతున్నారు.

అనుకున్నట్టుగానే… హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సభను ఏర్పాటు చేశారు.ఆ సభలో జేడీ ప్రసంగించాడు.ఆ తర్వాత ప్రసంగించిన జయప్రకాశ్‌ నారాయణ వేదిక మీద నుంచే లోక్‌సత్తాలోకి రావాల్సిందిగా.

వచ్చి నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా లక్ష్మీనారాయణను ఆహ్వానించారు.ఆ సమయంలో మాజీ జేడీని పలువురు నేతలు అభినందించి శుభాకాంక్షలు కూడా చెప్పారు.

ఆ తర్వాత మళ్ళీ మైక్ అందుకున్న లక్ష్మీనారాయణ …ఇప్పుడే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని.సొంతంగా పార్టీ పెడుతానంటూ ప్రకటించారు.

దీంతో ఒక్కసారిగా అంతా షాక్ కి గురయ్యారు.అదేంటి జేడీ లోక్ సత్తాలో చేరతాడు… పార్టీ అధ్యక్షుడు అవుతాడు అని అనుకుంటే ఇలా షాక్ ఇచ్చాడు ఏంటి అంతా చర్చినుకోవడం కనిపించింది.

అయితే లక్ష్మి నారాయణ తాను రాజకీయంగా ఎటువంటి స్టెప్ తీసుకోవాలో తెలియని డైలమాలో ఉన్నట్టు అందరికి అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube